Monday, January 27, 2025

సిఎం కేసిఆర్‌ను కలిసిన తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/తాండూరు: తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌ను తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి కలిసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆదివారం ప్రగతి భవన్‌లో సిఎం కేసిఆర్‌ను తాండూరు ఎమ్మెల్యే కలిసి పుష్ప గుచ్చం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. తాండూరుకు ఒకేసారి రూ.134కోట్లు నిధులు విడుదల చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తాండూరు నియోజకవర్గంలోని బషీరాబాద్ మండలానికి రూ.3కోట్లు, ఐటిఐ కాళాశాలకు రూ. 3కోట్లు, బిసి భవన్‌కు రూ.2కోట్లు, బంజారభవన్‌కు రూ.1కోటి, తాండూరు మండలోని 144గ్రామాలకు రూ.78కోట్లు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల అదనపు గదుల నిర్మాణానికి రూ.1.5౦కోట్లు, తాండూరు మున్సిపల్ పరిధిలోని 36వార్డులకు గాను రూ.36కోట్లు, కొత్త వ్యవసాయ మార్కెట్ కమిటి భవనానికి రూ.10కోట్లు కేటాయించడం అభినందనీయమని తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అన్నారు.

తాండూరు రూపురేఖలు మారుస్తానని ప్రజలకు ఇచ్చిన హామీ మేరకే నిధులు మంజూరు చేయించి అభివృద్ది పనులు చేపట్టడం జరుగుతుందని అన్నారు. తాండూరు నియోజకవర్గంలోని గ్రామ గ్రామాన, పట్టణంలోని వార్డు వార్డులలో ప్రజా సమస్యలు పరిష్కరించడంతోపాటు విద్య,వైద్య రంగాలలో ముందడుగు వేయడం జరుగుతుందన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు మంజూరు చేయించి తాండూరు ప్రాంతాన్ని అన్ని రంగాలలో అభివృద్ది దిశలో నడిపించడమే నా దేయమన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News