Sunday, December 22, 2024

తాండూరుకు నిధుల వరద

- Advertisement -
- Advertisement -

తాండూరు : తాండూరుకు నిధుల వరద కొనసాగుతోంది. ఎమ్మెల్యే ఫై లెట్ రోహిత్‌రెడ్డి కృషితో పట్టణ రోడ్లకు మరో రూ .20 .20 కో ట్లు మంజూరయ్యాయి. తాండూరు పట్టణంలోని ప్రధాన రోడ్లతోపాటు తాండూరులోకి వచ్చే ప్రధాన రోడ్డు మార్గాల ను అభివృద్ధి చేసేందు కు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి చేపట్టిన కృ షి ఫలించింది. ఇప్పటి కే పట్టణంలోని బస్టాండ్ నుంచి సె యి ంట్ మార్స్ హైస్కూల్ వరకు విస్తరించి అభివృద్ధ్ది చేసిన రోడ్డుకు ఇరువైపు లా బిటిరోడ్డు నుంచి వర్షపు నీటి డ్రై వరకు బిటి రోడ్డు నిర్మాణంతోపాటు ప ట్టణ సుందరీకరణకు రూ.25కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిన విషయం తెలిసిందే.

తాజాగా హైదరాబాద్ రోడ్డు మార్గంలోని ఖాంజాపూరు గేటు నుంచి విలియమూన్ వరకు ఉన్న రోడ్డును అభివృద్ధి చేసి ఇరువైపులా డ్రైన్ నిర్మాణంకు రూ.5.20కోట్లు విడుదల చేసింది. అదే విధంగా అంతారం రోడ్డు మార్గంలోని పాలకేంద్రం నుంచి అంతారం గ్రామం దాటిన తరువాత బైపాస్ రోడ్డు వరకు నాలుగ వరుసల రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రూ.15 కోట్లు కేటాయించింది. ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు ఆర్‌అండ్‌బి శాఖ జీవో 237 జారీ చేసింది. తాండూరు పట్టణంలోకి వచ్చే ప్రధాన రోడ్ల అభివృద్ధ్దికి నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి కేసిఆర్‌కు, ఆర్‌అండ్‌బి శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డికి ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News