Wednesday, January 22, 2025

బిజెపిని బొందపెట్టే సమయం ఆసన్నమైంది

- Advertisement -
- Advertisement -

తాండూరు: బిజేపిని బొందపెట్టే సమయం ఆసన్నమైందని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం బషీరాబాద్ మండల స్థాయి ఆత్మీయ సమ్మెళనం సభ కాశీంపూరు గ్రామ సమీపంలో నిర్వహించారు. ఆత్మీయ సమ్మేళన సభకు జనం భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ మూడు రోజులుగా బషీరాబాద్ మండలంలో పలు గ్రామాల్లో పల్లె పల్లెకు పైలట్ కార్యక్రమాలు నిర్వహించి ప్రతి గ్రామానికి రూ.50 లక్షలతో అభివృద్ధ్ది ఫలాలలను అందిస్తున్నానని అన్నారు. చాలా వరకు సమస్యలు ఉన్నాయని, వాటన్నింటిని తీర్చి సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దడమే లక్షంగా పెట్టుకున్నానని అన్నారు. బషీరాబాద్ మండలానికి ఏకంగా రూ.3 కోట్లు మంజూరు చేశానన్నారు. బషీరాబాద్ ముద్దుబిడ్డగా చెబుతున్నా తాండూరు నియోజకవర్గంలో అభివృద్ధి ఎమ్మెల్యే కాకముందు ఎట్లా ఉండేనో ఇప్పుడు ఎట్లా ఉందో మీరే గమనించారని అన్నారు.

నాడు.. నేడు అభివృద్ధ్ది అంటే ఏమిటో చేసి చూపించిన ఘ నత నాకే దక్కుతుందని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటిని నెలబెట్టుకున్నానని సభా ముఖంగా తెలిపారు. మహిళలకు సిఎం కేసిఆర్ పెద్దపీట వేస్తూ దేశంలో ఎక్కడలేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేశారని అన్నారు. అదే విధంగా అన్నదాతలకు అండగా 24గంటల కరెంటు సరఫరా, రైతు బంధు, రైతు బీమా, రుణమాఫీ, రైతు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే మంచి ధరకు కొనడం చేస్తుందన్నారు. రైతుకు పెద్ద పీఠ వేస్తూ రైతే రాజు అని భావించిన ముఖ్యమంత్రి కేసిఆర్ లాంటి నాయకుడు దేశంలో ఎక్క డా లేరని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మన సంతోషాలను చూసి ఓర్వలేక బిజెపి పార్టీ కుట్రలు చేస్తుందని విమర్శించారు. తెలంగాణ ప్రజలంతా ఒక్కతాటిపైకి వచ్చి తెలంగాణ ప్రభుత్వాన్ని మరింతగా బలపరచాలని అన్నారు.

గత పాలకుల నిర్లక్షంతోనే తాండూరు అభివృద్ధ్దికి నోచుకోలేదని నా పల్లె పల్లెకు పైలెట్ కార్యక్రమాలను ప్రతి పక్షాలు దొంగచాటుగా విడియోలు తీయించుకుంటున్నాయన్నారు. అయితే వారందరికీ దిమ్మదిరిగేలా నిధులు తీసుకొచ్చానని తెలిపారు. ఏం చేయాలో వారికి అర్థం కాక రెండు మూడు ఇంజక్షన్లు తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. నా చావైన బతుకైనా తాండూరు కోసమే.. బషీరాబాద్ బిడ్డగా చెబుతున్నా తాండూరు నియోజకవర్గ అభివృద్ధ్ది నా బాధ్యత అని అన్నారు. ప్రజలారా మీ అందరి ఆశీర్వాదం తప్పకుండా సిఎం కేసిఆర్‌పై, నాపైనా ఉండాలని వేడుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీశైల్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రాజుగౌడ్, మండల పార్టీ అధ్యక్షులు రాములునాయక్, సీనియర్ నాయకులు నర్సిరెడ్డి, వెంకట్‌రాంరెడ్డి, రవీందర్‌రెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News