Monday, December 23, 2024

ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి క్షేమంగా రావడంతో అభిమానుల సందడి

- Advertisement -
- Advertisement -
  • దేవాలయాల్లో పూజలు, ఇంటి వద్ద అభిమానుల కోలాహలం

తాండూరు: తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి క్షేమంగా ఇంటికి తిరిగి రావడంతో అభిమానులు సందడి చేశారు. తాండూరు నియోజకవర్గంలోని తాండూరు, పెద్దేముల్, బషీరాబాద్, యాలాల మండలాలతోపాటు తాండూరు పట్టణానికి చెందిన అభిమానులు, కార్యకర్తలు, నాయకులు ఎమ్మె ల్యే నివాసానికి పెద్దఎత్తున తరలివచ్చారు.

తాండూరు ప్రజలు ప్రేమానురాగాలు, దేవుని కృపతో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ప్రమాదం నుంచి బయట పడటం తో అభిమానులు, నాయకులు దేవాలయాల్లో, చర్చిలలో, మసీదుల్లో, దర్గాలలో ప్రత్యేక పూజలు చేయించారు. ఎమ్మెల్యే ఇంటి ముందు కొందరు నాయకులు 1101 కొబ్బరికాయలు పగులకొట్టారు. మిఠాయిలు పంచుకున్నారు. టపాకాయలు కాల్చారు. తమ నాయకుడు రోహిత్‌రెడ్డి ప్రమాదం నుంచి తప్పించుకుని క్షేమంగా తిరిగి రావడంతో అభిమానులు కోలాహానికి అవదులు లేకుండా పో యాయి. ఎమ్మెల్యేను కలిసి క్షేమంగా ఉండాలని నాయకులు, అభిమానులు కోరారు.

ఎమ్మెల్యే తండ్రి విఠల్‌రెడ్డి అభిమానుల మద్య తనయుడైన రోహిత్‌రెడ్డికి మిఠాయిలు తినిపించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు విశ్వనాథ్‌గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రాజుగౌడ్, నాయకులు నయిం అప్పు, నర్సిరెడ్డి, వెంకట్‌రెడ్డి, నర్సింలు, శ్రీనివాస్‌చారి, హరిగౌడ్, ఇంతాజ్‌బాబ, అభిమానులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News