Wednesday, January 22, 2025

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి సేవలో ఎంఎల్ఏ రోజా

- Advertisement -
- Advertisement -

MLA Roja Visits Yadadri Temple

యాదాద్రి భువనగిరి: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామిని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి చెందిన నగరి శాసనసభ్యురాలు ఆర్.కె.రోజా శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. ఎమ్మెల్యే రోజాకు ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి,తీర్థ ప్ర‌సాదాలు అంద‌జేశారు. యాదాద్రిగుట్టపై వెలిసిన శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారికి భక్తిప్రపత్తులతో పూజా కార్యక్రమాలు నిర్వహించినట్టు ఆమె తెలిపారు. రోజా వెంట టిఆర్ఎస్ ఎమ్మెల్సీ సుర‌భి వాణిదేవీ, యాదాద్రి జ‌డ్పీ చైర్మ‌న్ ఎలిమినేటి సందీప్ రెడ్డితో పలువురు అధికారులున్నారు.

MLA Roja Visits Yadadri Temple

MLA Roja Visits Yadadri Temple

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News