Monday, December 23, 2024

చిల్లర రాజకీయాలు చేస్తున్నారు: ఎంఎల్ఎ సండ్ర

- Advertisement -
- Advertisement -

సత్తుపల్లిః కొంత మంది తప్పుడు పద్ధతిలో సోషల్ మీడియాను అడ్డుపెట్టుకొని చిల్లర రాజకీయాలు చేస్తున్నారని, ముసుగు తొలగించుకొని రాజకీయాలు చేయాలని సత్తుపల్లి ఎంఎల్ఎ సండ్ర వెంకట వీరయ్య అన్నారు. నియోజకవర్గంలో 100 మంది లబ్దిదారులకు సిఎం రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ. 66,54,200/- ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను సత్తుపల్లి టౌన్, రూరల్ మండలాలు వేంసూరు, పెనుబల్లి మండలాలకు చెందిన 52 మంది లబ్దిదారులకు గురువారం రూ. 33,30,500/- విలువగల సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను గురువారం ఎంఎల్ఎ క్యాంప్ కార్యాలయంలో
సండ్ర పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎంఎల్ఎ సండ్ర మాట్లాడుతూ.. మూడు సార్లు గెలిపించిన ప్రజలకు అభివృద్ది చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ పిలుపు మేరకు టిఆర్‌ఎస్ పార్టీలో చేరినట్లు తెలిపారు.ఆ రోజుల్లో మహాకూటమిలో ఉండబట్టి మహాకూటమి తరఫున పనిచేశానని, ఎప్పుడు దొంగ రాజకీయాలు చేయలేదన్నారు. అహంభావంతోనే వేరే పద్ధతితోనో ఎక్కడా పనిచేయలేదన్నారు. ముఖ్యమంత్రి సహకారంతో వారి నాయకత్వాన్ని నమ్మినందుకే ప్రత్యేక నిధులను తీసుకొస్తున్నానన్నారు. ఒక సత్తుపల్లికే రూ. 60 కోట్లు నిధులను బిఆర్‌ఎస్ పార్టీ సహకారంతో తీసుకొచ్చానన్నారు. కొంత మంది తప్పుడు పద్దతిలో, షార్ట్‌కట్ మెథడ్‌లో రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ముసుగు తొలగించుకుని రాజకీయాలు చేయాలన్నారు.

దుష్ట రాజకీయాలకు పాల్పడుతూ తప్పుడు పద్ధతులు, చిల్లర రాజకీయాలు, చిల్లర ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. చాలా మంది పెద్దలు చెప్పిన ఆనాడు తెలుగుదేశం పార్టీని నమ్ముకుని పార్టీ కోసం నిబద్దతతో కేసులను ఎదుర్కొన్నానని, దొంగ రాజకీయాలు చేయటం అలవాటు లేదన్నారు.ఎస్సీ నియోజకవర్గంలో ఓసీ నాయకత్వం పోటీ చేయదని, రాజ్యాంగబద్దంగా ఎవరు పోటీ చేసినా ఎస్సీలు పోటీ చేయాలని అన్నారు. తప్పుడు పద్ధతిలో సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని చిల్లర రాజకీయాలు చేస్తున్నారన్నారు. గతంలో నాయకులు చేసిన అభివృద్దిని, నాయకులను ఎప్పుడు తప్పు పట్టలేదన్నారు. గతంలో తాను టిడిపిలో ఉన్నప్పుడు తనను పెళ్ళికి పిలువ వద్దని హుకుం జారీచేశారని, ఎంఎల్ఎ కు టీ కూడా ఇవ్వవద్దని అన్నారని గుర్తు చేశారు.

ఒక దళితుడిగా తెలుగుదేశంలో ఉంటే జీర్ణించుకోలేని కొంత మంది మరలా గెలిచిన తరువాత తప్పుడు రాజకీయాలు చేస్తున్నారన్నారు. చివరి వరకు పార్టీని కాపాడాలని కార్యకర్తగా కష్టపడ్డానని, లబ్ది పొందకుండా, మంత్రి పదవులు పొందకుండా కార్యకర్తగా కష్టపడి పనిచేశానని, అనుభవించిన పెద్దలు అందరు మారిన తరువాత చివరకు పార్టీ మారాల్సి వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి దొడ్డా హైమావతి శంకరరావు, మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, సొసైటీ అధ్యక్షులు చల్లగుళ్ళ కృష్ణయ్య, నాయకులు దొడ్డా శంకరరావు, షేక్ రఫి, పలువురు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News