Monday, December 23, 2024

క్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే సండ్ర

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/కల్లూరు: మంగళవారం ఏన్కూరు వద్ద జరిగిన ఆటో ప్రమాదంలో గాయపడ్డ అంబేద్కర్ నగర్ కు చెందిన 11 మంది క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వ దవఖానాలో చికిత్స నిమిత్తం చేర్పించగా చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య బుధవారం పరామర్శించారు. బుధవారం ఖమ్మం ప్రభుత్వ దవఖానకు సండ్ర వెళ్లి అక్కడ వైద్య బృందాన్ని ఎప్పటికప్పుడు క్షతగాత్రుల యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటున్నారు.

అనంతరం వైద్యులను మంచి వైద్యం అందించాలని వారిని ఆయన కోరారు. వెంటనే మండల నాయకత్వాన్ని తక్షణ సహాయం కొరకు సంఘటన స్థలానికి కల్లూరు ఎంపిపి బీరవల్లి రఘుని క్షతగాత్రుల దగ్గరకు పంపి అందుబాటులో ఉండమని ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ వైద్యాధికారులకు చరవాణి మెరుగైన వైద్యం వారికి అందించాలని సూచించారు. దురదృష్టవశాత్తు మరణించిన ఇద్దరి పార్థివ దేహాలను సందర్శించి నివాళులర్పించి వారి కుటుంబాలకు మనోధైర్యం కల్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News