Monday, January 20, 2025

అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే సంజయ్ చర్చ

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: జగిత్యాల పట్టణంలో ఇళ్లు లేని నిరుపేదల కోసం నూకపెల్లి శివారులో నిర్మిస్తున్న 4520 డబుల్ బెడ్ రూం ఇళ్ల కాలనీలో అభివృద్ది పనులకు కావాల్సిన నిధుల గురించి రాష్ట్ర సచివాలయంలో సంబంధిత అధికారులతో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ చర్చించారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్ల కాలనీలో మౌళిక వసతులైన తాగునీరు, విద్యుత్, మురికి కాల్వలు, రోడ్ల నిర్మాణానికి అవసరమైన నిధుల గురించి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి సూచన మేరకు ఆయన ఛాంబర్‌లో మంగళవారం హౌజింగ్ సిఇ రవీందర్‌రెడ్డి, ఎస్‌ఇ బలరాం, ఓఎస్‌డి ముకుందరెడ్డిలతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు.

డబుల్ ఇళ్ల కాలనీలో చేపట్టాల్సిన పనులను ఎమ్మెల్యే అధికారులకు వివరించి వాటికి కావాల్సిన నిధుల గురించి చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంట జగిత్యాల పిఆర్ ఇఇ రహమాన్, డిఇ మిలింద్ ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News