కోహెడ: తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఆడపిల్లల పెళ్ళికి వారి తల్లిదండ్రులకు అప్పులు తప్పలేదని గత ప్రభుత్వాలు ఆడబిడ్డలకు ఆర్థిక భరోసా కల్పించలేదని, హుస్నాబాద్ నియోజకవర్గంలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఎమ్మె ల్యే వొడితల సతీష్ కుమార్ అన్నారు. శనివారం పట్టణంలోని ఎంపిడిఓ కార్యాలయంలో హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాలతోపాటు పట్టణానికి చెందిన 19 6 మంది లబ్ధిదారులకు 1 కోటి 96 లక్షల 22 వేల 736 రూపాయల విలువగల కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సిఎం కెసిఆర్ పెదింటి ఆడబిడ్డలకు మేనమామగా అండగా నిలుస్తున్నారని అన్నారు.
రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధి కోసం, ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపేందుకు సిఎం కెసిఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. టిఆర్‌ఎస్ మేనిఫెస్టోలో లేకున్నా కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ రాష్ట్రంలో అమలు చేయడం గర్వించదగ్గ విష యం అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆడపిల్ల పెళ్లి చేయడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సిఎం కెసిఆర్ మానస పుత్రిక అయిన కళ్యా ణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా లక్ష 116 రూ పాయలు ఇవ్వడం పేదింటి ఆడబిడ్డలకు వరం లాంటిదని దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలోనే అద్భుతమైన పథకాలు అమలు చేయడం జరుగుతుందని అన్నారు. సిఎం కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృ ద్ధి సంక్షేమంలో దూసుకుపోతుందని సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా బిఆర్‌ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని స్పష్టం చేశారు.
ఇవే కాకుండా గర్భిణుల కోసం, పుట్టిన పిల్లల కోసం కెసిఆర్ కిట్టు అందజేస్తున్నామని, రా ష్ట్రంలో మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా షీటీంలను ఏ ర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పట్టణాల తోపాటు పల్లెల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు ఖర్చు చేస్తు ందని ఆ దిశలోనే పల్లెలు పచ్చదనంతో ఉండేందుకు హరితహారం కార్యక్రమం తోపాటు పల్లె ప్రకృతి వనాలు ఏర్పా టు చేయడం జరుగుతుందని తెలిపారు. మిషన్ కాకతీయ ద్వారా గ్రామాల్లోని చెరువులలో పూర్తిగా తీయడం ద్వారా కొద్దిపాటి వర్షాలకే చెరువులు మత్తడులు దూకుతున్నాయని తెలిపారు. ప్రజలకు అవసరమైన సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, రాబోయే రోజుల్లో మరెన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో హుస్నాబాద్ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. బిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి, మున్సిపల్ చైర్‌పర్సన్ ఆకుల రజిత వెంకట్, ఎ ంపిపి మానస, మాలోతు లక్ష్మీ బిల్ నాయక్, కొక్కుల కీ ర్తి, జడ్పిటిసి భూక్య మంగ శ్రీనివాస్, ఆయా మండలాల ప్రజాప్రతినిధులు,అధికారులు లబ్ధిదారులు పాల్గొన్నారు.