Saturday, November 23, 2024

సాయన్న అంత్యక్రియలు అధికారికంగా ఎందుకు జరపలేదు: బిజెపి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కంటోన్మెంట్ ఎంఎల్‌ఎ జి. సాయన్న అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపకపోవడాన్ని బిజెపి తీవ్రంగా ఖండించింది. నిజాం వారసులకు దక్కిన గౌరవం కూడా సాయన్నకు దక్కలేదని బిజెపి ఎస్‌సి మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు భాష ఆవేదన వ్యక్తం చేశారు. 1994 నుంచి మూడు దశాబ్దాల పాటు ఐదుసార్లు కంటోన్మెంట్ ప్రజల ఆశీర్వాదంతో సాయన్న ఎంఎల్‌గా గెలిచి ప్రజాసేవలో కొనసాగిన ఆజాత శత్రువు అని ఆయన తెలిపారు. ఎంతో మంది సినీ, రాజకీయ నాయకుల అంత్యక్రియలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడాన్ని బిజెపి ఏనాడు తప్పుబట్టలేదన్నారు.

అయితే మంత్రి తలసాని ఆధ్వర్యంలో సాయన్న అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించి, తర్వాత మర్చిపోవడం శోచనీయమన్నారు. ఏడో నిజాం వారసుడు ముకరంజా బహదూర్ ఎక్కడో ఇస్తాంబుల్‌లో చనిపోతే ప్రత్యేక విమానంలో ఆయన పార్థివదేహాన్ని తీసుకొచ్చి అధికార లాంఛనాలతో ప్రభుత్వం అంత్యక్రియలను నిర్వహించిందని ఆయన గుర్తు చేశారు. ఆదే రీతిలో దళితనేత ఎంఎల్‌ఎ సాయన్న అంత్యక్రియలు జరపకపోవడం వెనుక అంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News