మన తెలంగాణ/కంటోన్మెంట్: కంటోన్మెంట్ ఎంఎల్‌ఎ సాయన్న (72) గత కొంతకాలంగా షుగర్, బిపి, గుండె, మూ త్రపిండాల వ్యాధితో ఆయన బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఈనెల 16వ తేదీన సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చేరిన ఆ యనకు వైద్యులు ఐసియూలో ఉంచి సేవలం దించారు. సాయన్నకు షుగర్ లెవల్స్ పూర్తిగా పడిపోయి ఆదివారం మధ్యాహ్నం 1.50 గం టలకు తుదిశ్వాస విడిచారు. సాయన్న పార్థివదేహాన్ని కుటుంబ సభ్యులు అశోక్‌నగర్‌లోని ఆయన నివాసానికి తరలించారు. సాయన్న మరణవార్త విన్న కంటోన్మెంట్‌లోని బిఆర్‌ఎస్ నాయకులు పార్టీ కార్యకర్తలు ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో ఆయన నివాసానికి చేరుకున్నారు.
సాయన్న మృతిపై రాష్ట్ర ముఖ్యమం త్రి కె. చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్య క్తం చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే కెసిఆర్ అశోక్‌నగర్ చౌరస్తాలో ఉన్న సాయన్న ఇంటికి చేరుకొని ఆయన పార్థీవ దేహం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుటుంబీకులను సి ఎం పరామర్శించారు. సాయన్న చికిత్స పొం దుతూ మృతి చెందడంపై కెసిఆర్ విచారం వ్య క్తం చేశారు. ఐదుసార్లు శాసనసభ్యుడిగా, వి విధ పదవుల ద్వారా సాయన్న చేసిన ప్రజాసే వ చిరస్మరణీయమమన్నారు. ఈ సందర్భంగా సాయన్నతో ఉన్న తన అనుబంధాన్ని సిఎం గుర్తుచేసుకున్నారు. ఇదిలాఉండగా సాయ న్న అంత్యక్రియలు సోమవారం బన్సీలాల్‌పే ట శ్మశాన వాటికలో నిర్వహించనున్నట్లు కు టుంబసభ్యులు తెలిపారు.
పలువురి సంతాపాలు
సాయన్న మృతి పట్ల శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు కెటిఆర్, హరీష్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, మహమ్మూద్‌అలీ, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, పువ్వాడ అజయ్‌కుమార్, గంగుల కమాలకర్, మల్లారెడ్డి, జగదీష్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, సబితా ఇందిరారెడ్డి, ఎంఎల్‌సిలు కవిత, ప్రభాకర్, ఎంపీలు కె. కేశవరావు, నామా నాగేశ్వర్‌రావు, జోగినపల్లి సంతోష్‌కుమార్, రంజిత్‌రెడ్డి, కొత్త ప్రభాకర్, రవిచంద్ర, టిడిపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జి. సాయన్న, ఆ పార్టీ రాష్ట్ర నాయకులు అరవింద్‌కుమార్‌గౌడ్, బక్కని నర్సింహులు, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపిలు డాక్టర్ కె. లక్ష్మణ్, పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఆ పార్టీ శాసనసభ్యురాలు సీతక్క తదితరులు ఉన్నారు.
ఐదుసార్లు కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కంటోన్మెంట్ బాద్‌షా సాయన్న
జ్ఞాని సాయన్న 1951 మార్చి 5న నగరంలోని చిక్కడపల్లిలో జన్మించారు.1981లో ఓయు నుంచి బీఎస్సీ పూర్తి అనంతరం ఎల్‌ఎల్‌బి విద్యను పూర్తి చేశారు. ఆయనకు భార్య గీత, ముగ్గురు కూతుర్లు నమ్రత, నివేదిత, లాస్యనందిత ఉన్నారు. స్టేట్‌బ్యాంక్ ఇండియాలో క్యాషియర్ విధులను నిర్వర్తించారు. అనంతరం చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల మధ్య తెలుగుదేశం పార్టీలో రాజకీయ ఆరంగ్రేటం చేశారు. 1989లో దోమలగూడ కౌన్సిలర్ బరిలో నిలిచి ఓటమి చవిచూశారు. అనంతరం కంటోన్మెంట్ ఎస్సీ నియోజకవర్గం కావటంతో టిడిపి నుంచి 1994లో మొదటిసారి ఎంఎల్‌ఎగా విజయం సాధించారు. అనంతరం 1999, 2004లో ఎంఎల్‌ఎగా హ్యాట్రిక్ సాధించారు. 2009లో కాంగ్రెస్ పార్టీ ఎంఎల్‌ఎ శంకర్‌రావు చేతిలో ఓటమి పాలయ్యారు. తిరిగి 2014 టిడిపి తరపున ఎమ్మెల్యేగా గెలిచి 2015లో అప్పటి టిఅర్‌ఎస్ ఇప్పటి బిఅర్‌ఎస్ పార్టీలో చేరారు. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో అప్పటి కేంద్ర మంత్రి సర్వేసత్యనారయణపై ఘన విజయం సాధించారు.
షుగర్‌తో బాధపడుతూ 2018 ఎన్నికల సమయంలో ప్రచారంలో దృష్టి సారించక పోవడంతో ఆరోగ్యం క్షీణించింది. సాయన్నకు ఎన్నికల ఫలితాల సమయంలో ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో ఉన్నప్పుడే ఆయన 2018 ఎంఎల్‌ఎగా గెలిచారని వార్త విన్నారు. ఆరోగ్య కారణాల రీత్యా ఒక్కకాలు అప్పటి నుంచి ఇబ్బందులు పడుతున్నారు. అయినా తన అరోగ్యాన్ని లెక్క చేయకుండా ప్రజా సమస్యల పరిష్కారానికి నిత్యం అశోక్‌నగర్ నుంచి కార్ఖానాలోని ఆయన క్యాంపు కార్యాలయానికి వచ్చి ప్రజా సమస్యలను తెలుసుకునేవారు. బిఅర్‌ఎస్ ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. ఐదు సార్లు ఎంఎల్‌ఎగా గెలిచి కంటోన్మెంట్ ప్రజల కుటుంబాల్లో ఒక సభ్యుడుగా ఉండేవాడు సాయన్న. కార్ఖానలో నిత్యం పార్టీ శ్రేణులు ఆయన అభిమానులు ప్రజలతో సందండిగా ఉండే సాయన్న క్యాంపు కార్యాయంలో ఒక్కసారిగా నిశబ్దం చోటు చేసుకుంది. సాయన్న మరణవార్త విన్న అభిమానులు చూడటానికి ఆయన నివాసానికి తరలివెళ్లారు.