Monday, December 23, 2024

పోడు భూములకు పట్టాలిచ్చే వరకు పోరాటం చేస్తా : సీతక్క

- Advertisement -
- Advertisement -

గంగారం: పోడు భూములకు పట్టాలు ఇచ్చే వరకు పోరాటం చేస్తానని, గడిచిన ఎనిమిదేళ్ల కెసిఆర్ పాలనలో ఒక్క డబుల్ బెడ్‌రూం ఇల్లు ఇవ్వని పరిస్థితి నెలకొందని కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎంఎల్ఎ సీతక్క అన్నారు. శనివారం గంగారం మండలలోని మామిడిగూడెం, దుబ్బగూడెం, తాళ్లగుంపు గ్రామాల్లో 150 కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంఎల్ఎ సీతక్క మాట్లాడుతూ.. పోడు భూముల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వంతో పోరాటం చేస్తున్నామని పోడు భూములకు పట్టాలిచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు.

నన్ను ఆదరించి అక్కున చేర్చుకున్న ప్రజలకు మరింత సేవ చేస్తానని, చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం తాళ్ల గుంపు గ్రామానికి చెందిన 20 మంది వివిధ పార్టీల నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ఈసం రమ సురేష్, ఎంపీపీ సువర్ణపాక సరోజన జగ్గారావు, గంగారం మండల మాజీ అధ్యక్షుడు జాడి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News