Tuesday, December 24, 2024

కన్నీటి పర్యంతమైన ఎంఎల్ఎ సీతక్క

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ములుగు ఎంఎల్‌ఎ సీతక్క నల్లెల్ల కుమారస్వామి మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. అన్నా అని అప్యాయంగా పిలుచుకునే నల్లెల్ల ఇకలేరు అనే విషయాన్ని గుర్తుచేసుకోలేమని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ములుగు బాలికల పాఠశాలలో చదివినప్పుడు కుమారన్న ఎబివిపి లీడర్ గా స్కూల్ కు వచ్చేవారని సీతక్క గుర్తు చేసుకున్నారు.

సీతక్క అనుచరునిగా వ్యవహరిస్తున్న నల్లెల్ల కుమార్ మృతితో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సీతక్కకు కుడి భుజంగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ అనేక విజయాలలో కీలక భూమిక పోషించిన నల్లెల్ల కుమార్ అన్న అంతిమయాత్రకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చి కన్నీటి వీడ్కోలు పలికారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News