Monday, December 23, 2024

ములుగులో రోడ్డు ప్రమాదం.. ఎంఎల్ఎ సీతక్క పిఎ జబ్బార్ మృతి..

- Advertisement -
- Advertisement -

ములుగు: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే సీతక్క పిఎ జబ్బార్ మృతి చెందారు. శనివారం రాత్రి ములుగు కేంద్రంలోని సాధన స్కూల్ వద్ద బైక్ పై వెళ్తున్న జబ్బార్ అదుపుతప్పి డివైడర్ ని ఢీకొట్టాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన జబ్బార్ సంఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం దవాఖానాకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News