- Advertisement -
హైదరాబాద్: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని అంబాల గ్రామ చెక్ పోస్టు వద్ద ఆదివారం సాయంత్రం ములుగు ఎంఎల్ఎ సీతక్క వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో భాగంగా హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని శ్రీరాములపల్లిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట నర్సింగరావుతో కలిసి ఎంఎల్ఎ సీతక్క ఎన్నికల ప్రచారం చేశారు. అనంతరం అంబాల గ్రామంలో ప్రచారానికి సీతక్క వాహనంలో వెళ్తుండగా అంబాల గ్రామ చెక్ పోస్టు వద్ద పోలీసులు ఎంఎల్ఎ సీతక్క వాహనాన్ని తనిఖీ చేశారు. తనిఖీ అనంతరం సీతక్క వాహనంలో అంబాల ప్రచారానికి వెళ్లారు.
- Advertisement -