Monday, January 20, 2025

మండలాల విభజన బిఆర్‌ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమైంది

- Advertisement -
- Advertisement -

బోధన్ రూరల్: నూతన సాలురా మండల కేంద్రాన్ని బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమేర్ చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించారు. శనివారం సాలురా మండల ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే షకీల్‌ను బోధన్ నియోజక వర్గ నాయకులు, సాలురా మండల ప్రజాప్రతినిధులు, నాయకులు సాదరంగా స్వాగతం పలికారు. కార్యాలయంలో ఎమ్మెల్యే షకీల్, బోధన్ ఆర్డీవో రాజేశ్వర్, ఎంపిపి బుద్దె సావిత్రి రాజేశ్వర్, గ్రామ సర్పంచ్ బుయ్యన్ చంద్రకళ రాజప్ప, తహసీల్దార్ మమత పూజలు నిర్వహించి మండల కేంద్రాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే షకీల్ మాట్లాడుతూ… అనేక సంవత్సరాల కల సహకారమైందన్నారు. అతిపెద్ద గ్రామ పంచాయతీ అయినటువంటి సాలురా గ్రామం మండల కేంద్రంగా ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

సాలురా మండల కేంద్రాన్ని ప్రారంభించడం అభినందతాయకమన్నారు. సాలురా మండల గ్రామాల ప్రజలకు, ప్రజాప్రతినిధులకు నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. త్వరలో సాలురా మండల కేంద్రంలో అన్ని కార్యాలయాల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. సాలురా మండల కేంద్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. మండలాల విభజన కేవలం బిఆర్‌ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమైంది అనడంలో అతిశయోక్తి లేదన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకోవడానికి ముందుండాలని సూచించారు.

కార్యక్రమంలో ఎన్డీసిసిబి డైరెక్టర్ జి. శరత్, మండల మాజీ రైసస కో ఆర్డినేటర్ బుద్దె రాజేశ్వర్, సాలురా పిఎసిఎస్ చైర్మన్ అల్లె జనార్ధన్, బోధన్ ఏఎంసి చైర్మన్ విఆర్. దేశాయ్, వైస్ చైర్మన్ సాలురా షకీల్, వైస్ ఎంపిపి కోట గంగారెడ్డి, బిఆర్‌ఎస్ పార్టీ మండలాధ్యక్షులు గోగినేని నర్సయ్య, ఎంపిడివో శ్రీనివాస్, తహసీల్దార్ వరప్రసాద్, ఎంపిఓ మధుకర్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, గ్రామ పెద్దలు, సురేష్ పటేల్, అల్లె రమేష్, డిస్కో సాయిలు, వెంకట్ పటేల్, గ్రామాల పెద్దలు, బోధన్ నియోజక వర్గం బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సాలురా మండల వివిధ గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News