Monday, December 23, 2024

మనసున్న మహారాజు బోధన్ ఎమ్మెల్యే షకీల్

- Advertisement -
- Advertisement -

 

నవీపేట్: మండల కేంద్రంలోని రామాలయ నిర్మాణానికి బోధన్ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ ఆమెర్ బుధవారం వేద పండితుల సమక్షంలో శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆలయ నిర్మాణానికి దేవాదాయ శాఖ నుండి 50 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. అలాగే తనవంతు సహాయంగా ఐదు లక్షల ఒక వెయ్యి రూపాయలు ఆలయ నిర్మాణానికి అందిస్తామన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఆలయ నిర్మాణానికి అహర్నిశలు కృషి చేస్తున్న వీడీసీ సభ్యులను అభినందించారు. ఈసందర్భంగా విడిసి సభ్యులు ఎమ్మెల్యే షకీల్ ఆమెర్‌ను పట్టు వస్త్రాలతో సన్మానిస్తూ, అడగగానే ఆలయ అభివృద్ధికి సహకరించిన మనసున్న మహారాజు అని కొనియాడారు. ఈకార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఏటిఎస్ శ్రీనివాస్, ఎంపిపి సంగెం శ్రీనివాస్, జడ్పీటిసి నీరడి సవిత బుచ్చన్న, పార్టీ అధ్యక్షులు నర్సింగరావు, సొసైటీ చైర్మన్ అబ్బన్న, వైస్ చైర్మన్ ప్రవీన్, ఉప సర్పంచ్ కరిపె మల్లేష్, మూడు గ్రామాల విడిసి సభ్యులు గడ్డం రాంరెడ్డి, సూరిబాబు, సాయిరెడ్డి, తెడ్డు పోశెట్టి, ఆలయ పండితులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News