- Advertisement -
బోధన్: నిజామాబాద్ జిల్లా బోధన్ ఎంఎల్‌ఎ షకీల్ సతీమణి వాహనం ఢీకొని బాలుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బోధన పట్టణ శివారులో వివాహ వేడుక ఉండడంతో ఎంఎల్‌ఎ షకీల్ సతీమణి అయేషా ఫాతిమా హాజరయ్యారు. తిరుగు ప్రయాణంలో తన కాన్వాయ్‌లో వెళ్తుండగా దీపక్ తేజ్(12) అనే బాలుడిని కారు ఢీకొట్టింది. అదే వివాహ వేడుకకు దీపక్ తన తల్లిదండ్రులతో కలిసి హాజరయ్యాడు. బాలుడు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉందడంతో హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో బాలుడు మృతి చెందాడు. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి మృతదేహాన్ని బోధన్ ఆస్పత్రికి తరలించారు.
Also Read: మరో విద్వేష చిత్రం!
- Advertisement -