మనతెలంగాణ/గరిడేపల్లి: సహకార సంఘాల అభివృద్దికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. శుక్రవారం గరిడేపల్లి మండలంలోని కీతవారిగూడెం గ్రామంలో నాబార్డు నిధులు రూ.96లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన సహకార సంఘం గోదాంలను ప్రారంబించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పాలక వర్గాలు సహకార సంఘాలు నిర్వీర్యం చేశాయని, సహకార సంఘాల బలోపేతంతోనే వ్యవసాయ రంగం అభివృద్ది చెందుతుందని సీఎం కెసిఆర్ సంఘాలకు పూర్వవైభవం తీసుకువచ్చి సహకార సంఘాలను అభివృద్ది చేసి రైతులకు అండగా నిలిపారని కొనియాడారు.
సహకార సంఘాల ద్వారా రైతులకు స్వల్పకాలిక,దీర్ఘకాలిక రుణాలతో పాటు ఎరువులు ,పురుగుమందులు అందజేయడమే గాక పెద్ద ఎత్తున గోదాములు నిర్మించి ఇచ్చిందన్నారు. సహకార సంఘాను వాణిజ్యపరంగా కూడా అభివృద్ది చేస్తూ తెలంగాణ రాష్ట్రం దేశంలో ఆదర్శంగా నిలుస్తుందన్నారు. రైతులు సహకార సంఘం సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.