Monday, December 23, 2024

కబడ్డీ క్రీడాకారుడు షేక్ షాహిద్‌ను సన్మానించిన ఎంఎల్ఎ శంకర్‌నాయక్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/కేసముద్రం రూరల్: కేసముద్రం మండలంలోని అర్పనపల్లి గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ షేక్ జానీ కుమారుడు షేక్ షాహిద్ ఇటీవల అండర్-19 కబడ్డీ పోటీల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచి జాతీయస్థాయిలో ఎంపికైనందుకు రవాణ చార్జిల నిమిత్తం షాహిద్ తండ్రి చిన్ననాటి మిత్రులు చిలువేరు సమ్మయ్యగౌడ్ శుక్రవారం షాహిద్‌ను శాలువాతో సన్మానం చేసి ఆర్థికసాయం చేసి అభినందించారు.

మునుముందు కబడ్డీ క్రీడల్లో ఉత్తమస్థాయిలో రాణించి తల్లిదండ్రులకు, పుట్టిన ఊరు, ప్రాంతానికి మంచిపేరు తీసుకురావాలన్నారు. ఈకార్యక్రమంలో మోడెం రాజు, ఎస్‌కే జానీ, కంచ శ్రీనివాస్, జి.శ్రీనివాస్, విజేందర్, వెంకటేశ్వర్లు, అమీర్‌కుమార్, జానీ, యాకాంబ్రం, మురళి, అజాద్, షాహిద్, శ్రీనివాస్, రాము, కట్టయ్య, సాంబయ్య, అశోక్, సుభాష్‌లు పాల్గొన్నారు.

షాహిద్‌ను అభినందించిన ఎంఎల్‌ఎ శంకర్‌నాయక్

మండల టిఆర్‌ఎస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ తోనుపునూరి సాయికృష్ణ ఆధ్వర్యంలో అంతర్జాతీయస్థాయిలో కబడ్డీలో సెలక్ట్ అయిన అర్పనపల్లి గ్రామానికి చెందిన షేక్ షాహిద్‌ను ఎంఎల్‌ఎ బానోతు శంకర్‌నాయక్ ఘనంగా సన్మానించి అభినందించారు. ఈకార్యక్రమంలో ఎంపిపి చంద్రమోహన్, టిఆర్‌ఎస్ మండల అధ్యక్షులు నజీరా అహ్మద్, వీరునాయక్ తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News