మనతెలంగాణ/మహబూబాబాద్: మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కారానికి తోడ్పాటు అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను స్వయంగా కలసి ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ కోరారు. ఈ మేరకు ప్రగతి భవన్‌లో సీఎంను ఎమ్మెల్యే, ఆయన సతీమణి డాక్టర్ సీతామహాలక్ష్మీతో కలసి కలిశారు. ఈ మేరకు మహబూబాబాద్ జిల్లా ఏర్పాటు మీరు ఇచ్చిన వరం అని.. ఇక్కడ ప్రతీ అభివృద్ది పని మీరు అందించిన ఫలం అని పేర్కోన్నారు.
మానుకోటకు మరిన్ని వరాలు కురిపించాలని సీఎంకు విజ్ఙప్తి చేస్తూ పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. కేసముద్రంలో ఫైర్‌స్టేషన్, మల్యాలలో హార్టికల్చర్ డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని సీఎంను ప్రాధేయపడ్డారు. నియోజకవర్గంలో ఉన్ని సీనియర్ నాయకులకు నామినేటెడ్ పదువుల్లో ప్రాధాన్యత కల్పించాలని, నియోజకవర్గంలో నెలకొన్న అన్ని సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే సీఎంను కోరారు. అందుకు సీఎం సానుకూలంగా స్పందించారని, త్వరలోనే శుభవార్తలు వింటారని ఎమ్మెల్యే శంకర్‌నాయక్ వెల్లడించారు.
రోడ్ల కోసం మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి విజ్ఙాపన..
మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో అర్ అండ్ బీ రోడ్ల అభివృద్దితో పాటు వివిధ అభివృద్ది పనులు మంజూరు చేయాలని కోరుతూ హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో బుధవారం ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ వినతిపత్రాన్ని అందజేశారు. ఆయన వెంట మార్నేని వెంకన్న, ఎండి. ఖాసీం, నాయిని రంజిత్, తేళ్ల శ్రీను, సుధగాని మురళీ, లక్ష్మణ్‌రావు, ఆవుల వెంకన్న, దుర్గేష్, పోతురాజు రాజశేఖర్, రమేష్ తదితరులు ఉన్నారు.