Friday, November 22, 2024

తెలంగాణ గ్రామీణ కుటుంబ నేపథ్యాన్ని కళ్లకు కట్టిన ‘బలగం’..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/మహబూబాబాద్: తెలంగాణ గ్రామీణ కుటుంబ నేపథ్యాన్ని కళ్లకు కట్టినట్లు ‘బలగం’ చలన చిత్రంలో దర్శకుడు వేణు ఎల్దండి చూపించి ప్రతీ ఒక్కరిని ఆలోచింప చేశారని ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ అన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే మానుకోట పట్టణంలోని లక్ష్మీ కళామందిర్‌లో బలగం చిత్రాన్ని ఎమ్మెల్యే, ఆయన సతీమణి డాక్టర్ సీతామహాలక్ష్మీలు స్వంత ఖర్చుతో నాలుగు షోలను దగ్గరుండి తన బలగమైన పార్టీ శ్రేణులతో కలసి ఆయన సినిమాను వీక్షించారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, పార్టీ కార్యకర్తలతో పాటు స్థానికులకు కూడా సినిమాను ఉచితంగా చూపించారు. ఇటీవల బలగం సినిమా విజయోత్సవ సభలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, గంగుల కమలాకర్‌లతో పాటు చిత్ర నిర్మాత దిల్ రాజు, సినిమా దర్శకులు వేణు ఎల్దండితో పాటు చిత్ర యూనిట్‌తో పాల్గొన్న ఎమ్మెల్యే శంకర్‌నాయక్ ఇచ్చిన హామీ మేరకు ఒకరోజులో నాలుగు షోలను పార్టీ శ్రేణులకు దగ్గరుండి సినిమాను చూపిస్తామని ప్రకటించిన ఆయన చెప్పినట్లు వారందరికీ సినిమాను చూపించారు.

ఈ సినిమాను నియోజకవర్గంలో అన్ని మండలాల నుంచి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలను పిలిపించి మంచి కుటుంబ, గ్రామీణ, రోజురోజుకు తరిగిపోతున్న ఆఛారాలు, సాంప్రదాయాల ఇతివృత్తంతో పూర్తిగా తెలంగాణణ యాసతో తీసిన సినిమాను ప్రతీఒక్కరూ ఆదరించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్‌నాయక్ పిలుపునిచ్చారు. మానుకోట వాసి, తెలంగాణ ఉద్యమంలో కళాకారుడిగా సేవలందించిన దుగ్గి రాజు కూడా ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించడం అభినందనీయమన్నారు. సినిమాను ఆయనతో పాటు మున్సిపల్ చైర్మైన్ డాక్టర్ పాల్వాయి రాంమోహన్‌రెడ్డి, వైస్ చైర్మైన్ ఎండి. ఫరీద్, చిదిరాల శరత్, మార్నేని రఘు తదితరులు తిలకించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News