Monday, December 23, 2024

ఎంఎల్‌ఎ సీతక్క తల్లిదండ్రులకు పోడు పట్టాలు

- Advertisement -
- Advertisement -
స్వగ్రామం జగ్గన్నపేటలో పంపిణీ కార్యక్రమం
పట్టాలు చూసి ఆనందం
ములుగు జిల్లా ప్రతినిధి: ముఖ్యమంత్రి కెసిఆర్ సంక్షేమ పథకాల్లో ఎలాంటి బేషజాలు లేకుండా ప్రతిపక్ష నాయకులకు సైతం అందించడమే కాకుండా ఇలాంటి గొప్ప పథకాలు అందరికీ ఉపయోగపడుతున్నాయని మరోసారి నిరూపించారు. పోడు భూములపై హక్కుల కోసం గిరిజనులు చేస్తున్న పోరాటం గుర్తించి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ఆదివాసీ బిడ్డలకు ప్రభుత్వం పోడు పట్టాలు అందిస్తుంది.అందులో భాగంగా గురువారం ములుగు మండలంలోని ఎంఎల్‌ఎ సీతక్క స్వగ్రామమైన జగ్గన్నపేటలో అధికారులు పోడు భూమి పట్టాలు అందజేశారు. లబ్ధిదారుల్లో ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకురాలు సీతక్క తండ్రి ధనసరి సమ్మయ్య పేరు మీద 1-.17 గుంటల భూమి సంబంధించిన పత్రాలు అందించారు. దీంతో పోడు పట్టాలు చూసిన సీతక్క తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.
సుదీర్ఘంగా కసరత్తు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులు, గిరిజనేతరులు కలిపి 12 లక్షల 49 వేల ఎకరాల భూముల్లో సాగు చేసుకుంటున్నారు. వీటిపై హక్కుల కోసం 4లక్షల 14 వేల మంది అడవి బిడ్డలు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. నూతనంగా పోడు పట్టాలు పొందిన గిరిజనులకు ప్రభుత్వం రైతుబంధును కూడా వర్తిం ప చేయనుందని పేర్కొంది. ఇప్పటికే ఆర్వో ఎఫ్ ఆర్ ద్వారా రైతుబంధు పొందుతున్న వారితోపాటు నూతనంగా పోడు పట్టాలు అందుకోబోతున్న గిరిజనులతో జాబితాను రెడీ చే సింది. ఈ కార్యక్రమంలో ములుగు జడ్పిటిసి సకినాల భవా ని ములుగు ఎంపిపి గండ్రకోట శ్రీదేవి జగ్గన్నపేట ఎంపిటిసి పోరిక విజయ్‌రామ్ నాయక్, ములుగు మండల ఎమ్మార్వో, ఎంపిడిఒ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News