Sunday, December 22, 2024

కర్రసాము చేస్తూ కిందపడ్డ ఎమ్మెల్యే

- Advertisement -
- Advertisement -

ప్రొద్దుటూరు: వైఎస్‌ఆర్‌సీపీ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డి ర్యాలీలో కర్ర సాము చేస్తూ అదుపుతప్పి కిందపడ్డారు. వివేకా హత్యకేసులో అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ లభించినందుకు గురువారం ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పట్టణంలోని మార్కెట్‌ యార్డు నుంచి 108 కలశాలతో ప్రారంభమైన యాత్ర శివాలయం వరకు సాగింది.

అయితే ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి కర్రసాము చేస్తుండగా ప్రమాదవశాత్తు కర్రతో తన కాలికి తాకడంతో బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయాడు. తోటి కార్యకర్తల ఎమ్మెల్యేకు తక్షణ సహాయాన్ని అందించారు. దీంతో అతను తిరిగి పైకి లేచి నిలబడ్డాడు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో శివప్రసాద్ రెడ్డికి ఎలాంటి గాయాలు కాలేదని పార్టీ నాయకులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News