Thursday, January 23, 2025

రంగనాథ ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

- Advertisement -
- Advertisement -

జోగిపేట: రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అందోల్ మండలంలో దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేపట్టారు. అందోల్‌లోని చరిత్రాత్మమైన రంగనాథ ఆలయంలో ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రభుత్వం చేపట్టిన దేవాలయాల్లో దూప,దీప, నైవేద్యాదుల పథకం కింద ఆందోల్ నియోజకవర్గంలో 39 మంది అర్చకులకు నియామక పత్రాలు అందజేశారు. పట్టణంలో హన్‌మాన్ దేవాలయం, పోచమ్మ దేవాలయం, అయ్యప్ప ఆలయం, సాయిబాబా ఆలయాలలో బిఆర్‌ఎస్ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిదులు మల్లిఖార్జున్, చాపల వెంకటేశం, శ్రీధర్, మల్లయ్య, బాలయ్య, గాజుల నవీన్, రామాగౌడ్, పులుగు గోపి, గాజుల అనిల్, తుపాకుల సునీల్, మహేష్‌యాదవ్, బీర్ల శంకర్; కోశికే సత్యం, సధాకర్, ఆకుల శంకర్; డాకూరి గణేష్‌లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News