Wednesday, January 22, 2025

నల్లపోచమ్మకు ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

- Advertisement -
- Advertisement -

మెదక్: మున్నూరు కాపు 17వ వార్షికోత్సవ బోనాల ఉత్సవాల సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి నల్లపోచమ్మ ఆలయానికి వెళ్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మెదక్ పట్టణంలో మున్నూరుకాపుల సంఖ్య ఎక్కువగా ఉందని, బోనాలు కూడా ఎక్కువ సంఖ్యలోనే వస్తాయని ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం మెదక్ శివారులో మున్నూరుకాపు జిల్లా భవనానికి కేటాయించిన స్థలానికి సంబందించిప్రొసిడింగ్ కాపిని ఆదివారం నల్లపోచమ్మ ఆలయ ప్రాంగణంలో ఆ సంఘం జిల్లా ప్రెసిడెంట్ బట్టి ఉదయ్‌కుమార్‌కు అందజేశారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ భవన నిర్మాణానికి తనవంతు సహకారం ఎల్లప్పుడు ఉంటుందని, ముఖ్యమంత్రి,మంత్రులను ప్రత్యేక నిధులు కేటాయించి నిర్మాణం పూర్తయ్యేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా హామినిచ్చి వీలైనంత త్వరగా భవన నిర్మాణాన్ని ప్రారంభించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్, కౌన్సిలర్ కృష్ణారెడ్డి, నాయకులు లింగారెడ్డి, అశోక్, మున్నూరుకాపు సంఘం నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News