Monday, December 23, 2024

రహదారి నిర్మాణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

- Advertisement -
- Advertisement -

భూపాలపల్లి రూరల్: చిట్యాల మండలం దూత్‌పల్లి గ్రామం, భూపాలపల్లి మండలం, కొత్తపల్లి ఎస్‌ఎం గ్రామాల రైతులు పంట పొలాలకు వెళ్ళడానికి రహదారి నిర్మాణ పనులను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ముఖ్య అతిధిగా హాజరై ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ దూత్‌పల్లి, కొత్తపల్లి ఎస్‌ఎం గ్రామాలు భూపాలపల్లి చిట్యాల మండల కూడలి అయిన ఈ రెండు గ్రామాల రైతులు పంట పొలాలకు వెళ్లడానికి ఇబ్బంది అవుతుందని గ్రామాల సర్పంచ్‌లు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు నా దృష్టికి తీసుకురావడం జరిగిందని, వెంటనే సిడిపి నిధుల నుండి రూ.10లక్షలతో రెండు గ్రామాల ప్రజలకు, రైతులకు ఉపయోగపడే విధంగా దాదాపు 3 కిలోమీటర్ల రహదారి నిర్మాణం చేపడుతూ పనులు ప్రారంభించడం జరిగిందన్నారు.

ఈ సంవత్సరం 1001 రకం వరి పంట వెయొద్దని, అవి కాకుండా సన్నరకం ధాన్యం పండించాలని రైతులను కోరారు. ఈ సందర్భంగా రైతులు రోడ్డు నిర్మాణానికి సహకరించిన ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా మండల, గ్రామాల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News