Sunday, December 22, 2024

విద్యుత్ ఉద్యోగుల ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే

- Advertisement -
- Advertisement -

నారాయణఖేడ్ టౌన్: నారాయణఖేడ్ పట్టణంలో సోమవారం విద్యుత్ ఉద్యోగులు ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ర్యాలీ కార్యక్రమాన్ని ఖేడ్ ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా విద్యుత్ విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చేపట్టిన సంస్కరణలతో నేడు అన్ని రంగాలు దూసుకుపోతున్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో విద్యుత్ కాంతులు విరజిమ్ముతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ నాయకులు, తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News