కరీంనగర్ :టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ పైన చేసిన ఆరోపణలు నిజమైతే నువ్వు నిలబడాలి, సమాచారం ఇవ్వాలి దీనిపైన క్లారిటీ ఉందా అని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సవాల్ చేశారు. ఆదివారం కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం విచారణ ఆదేశించిందన్నారు. దీనిని గందరగోళం పట్టించి గతంలో మీరు చేసిన తప్పులను వక్రీకరణ చేసుకోవడానికి నిరుద్యోగులు రెచ్చగొట్టడానికి లేనిపోని అబద్దాలు చెప్పుతున్నావని అన్నారు. నీవు పిసిసి అధ్యక్షుడువా గల్లీ లీడర్‌వా అని ఎద్దేవా చేశారు. మంత్రి కెటిఆర్ పిఏ తిరుపతికి సంబంధం ఉందని, మల్యాల మండలంలో వందకు పైగా మందికి వంద మార్కులు వచ్చాయని, ఒకసారి అదే నిమిషంలో తిరిగి పది మందికి 100కు పైగా మార్కులు వచ్చాయని రెండు ద్వంద రకాల మాటలు మాట్లాడటం ఎంతవరకు సమంజసమని అన్నారు.
నిజంగా కెటిఆర్ పిఏకు సంబంధించిన వంటి ఆధారాలుంటే అయిన లీవ్ చేసిన సమాచారం నీ దగ్గర ఉంటే అవి మాకు ఇస్తే స్వాగతిస్తామని ఎంత పెద్ద వారైనా చర్యలు తీసుకుంటామని ఇప్పటికే కేటీఆర్ స్పష్టం చేశారని గుర్తు చేశారు. తిరుపతి పేపర్ లీక్ చేశాడని ఆధారాలుంటే మా ప్రభుత్వానికి విచారణ బృందానికి ఇవ్వండి లేదా బహిరంగ పర్చాలని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి అసలు దరఖాస్తులు ఈ దగ్గరికి ఎలా వచ్చాయని, ఎంత మంది రాశారు, పరీక్ష విధానం నీకెలా తెలిశాయని, ఈ విషయం కేవలం టీఎస్‌పీఎస్సీకి తప్ప వేరే వారికి తెలిసేలా ఆస్కారం లేదంటే దీనిని బట్టి చూస్తే టిఎస్ పిఎస్ సి జరిగే ప్రతి సంవత్సరం మీకు వస్తుందని మాకు అనుమానాలు వస్తున్నాయని, పేపర్ లీకేజీలో కూడా మీకు సంబంధం ఉందని ఎందుకు అనుకోరాదు నిజంగా మీ దగ్గర లిస్టు ఉంటే ఎందుకు బహిరంగపరచడం లేదని పీఎ లీక్ చేశారని సమాచారం నీ దగ్గర ఉంటే బహిరంగ పరచూ… లేకుంటే ఇష్టానుసారంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోం ఖబర్దార్ రేవంత్‌రెడ్డి అని సవాల్ చేశారు.
రేవంత్‌రెడ్డి మీకు ప్రజాదారణ లేదు కాబట్టే బస్సుయాత్రలు చేపడుతున్నారని విమర్శించారు. పేపర్ లీకేజ్ అంటూ పబ్బం గడుపుతున్నారని ఇది మంచి పద్దతి కాదని అన్నారు. సిరిసిల్లలో జరిగిన ఆత్మహత్యను కూడా రాజకీయం చేయాలని చూడడం సరైంది కాదన్నారు. నవీన్‌కుమార్ అనే వ్యక్తి అసలు గ్రూప్‌లకే దరఖాస్తు చేయలేదు గ్రూప్‌కు దరఖాస్తు చేశాడని పరీక్షలకు సిద్దమవుతున్నాడని పేపర్ లీకేజీ వల్లనే ఆత్మహత్య చేసుకున్నాడని ఇంస్టాగ్రామ్‌లో పోస్టు చేశారని ఇలాంటి పోస్టు చేశారని, ఇది తప్పు అని స్వయంగా కుటుంబ సభ్యులు చెప్పిన, పలు పత్రికలలో కూడా ప్రచారం అయ్యాయని గుర్తు చేశారు. మంత్రి కేటీఆర్‌ను బద్నాం చేయాలని ఇలాంటి ఆరోపణలు చేస్తే సత్తా సామర్ధం లేక ఆధారాలు లేక పిఎ తిరుపతిని అడ్డుపెట్టుకొని డ్రామాలు ఆడుతున్నారని, అలిగేషన్ సంబంధించిన ఆధారాలుంటే బహిరంగంగా పర్చాలని సవాల్ చేశారు.
గత 18 సంవత్సరాలుగా మానవ విలువలు పాటిస్తూ మంత్రికేటీఆర్‌కి వ్యక్తిగత కార్యదర్శిగా నిజాయితీగా విధులు నిర్వహిస్తున్న తిరుపతిపై వస్తున్న ఆరోపణ తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్‌కుమార్ గౌడ్, బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మల్యాల జడ్పీటీసీ రాంమోహన్‌రావు, సింగిల్ విండో చైర్మన్లు సాగర్‌రావు, మధుసూదన్‌రావు, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు సుభాన్, మల్యాల మండలానికి చెందిన సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.