Monday, December 23, 2024

స్నానం చేస్తున్న ఓటరు దగ్గరకు వెళ్లి అభ్యర్థి ప్రచారం

- Advertisement -
- Advertisement -

లక్నో: యుపిలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకోడానికి నాయకులు ఏకంగా వాళ్ల ఇళ్ల లోకి వెళ్లి తమకే ఓటేయాలంటూ అభ్యర్థిస్తున్నారు. కాన్పూర్ లోని గోవింద్‌నగర్ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి బీజెపి తరఫున పోటీ చేస్తున్న ఎమ్‌ఎల్‌ఎ సురేంద్ర మియాధాని ఓటర్లను ప్రసన్నం చేసుకోడానికి ఓ వ్యక్తి స్నానం చేస్తుండగా అతడి దగ్గరికి వెళ్లి అతడితో ముచ్చటించడం ప్రారంభించాడు. ఆ వ్యక్తి స్నానం చేస్తున్నా… వదలకుండా ఇల్లు ఉందా ? అంతా ఓకేనా ? అంటూ ప్రశ్నించాడు. ఆ వ్యక్తి సబ్బుతో శరీరానికి రుద్దుకుంటూనే సమాధానం చెప్పడం, ఆ తరువాత రేషన్ కార్డు ఉందా అని ఎంఎల్‌ఎ ప్రశ్నించడం .. ఉందని అవతలి వ్యక్తి చెప్పడం … ఇదంతా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News