Friday, December 27, 2024

సీఎమ్ మహారాష్ట్ర పర్యటనకు తరలిన ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్

- Advertisement -
- Advertisement -

రాజేంద్రనగర్ : బిఆర్‌ఎస్ పార్టీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనకు రాజేంద్రనగర్ శాసన సభ్యుడు టి. ప్రకాష్‌గౌడ్ తరలి వెళ్లారు. పలువురు ఎమ్మెల్యేలతో కలసి ఆయన ప్రత్యేక బస్సుల్లో సోలాపూర్ నుంచి పండరీపూర్‌కు వెళుతున్న చిత్రలను ఆయన వెంట ఉన్న నాయకులు సోషల్ మీడియాలో పెట్టారు. దాంతో నియోజకవర్గంలోని బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు మన ఎమ్మెల్యే రాష్ట్ర ముఖ్యమంత్రి బాటలో బీఆర్‌ఎస్ విస్తరణకు మహారాష్ట్ర వెళ్లారంటూ చర్చించుకోవడం వినిపించింది. ఈ సందర్భంగా రాజేంద్రనగర్ నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రకాష్‌గౌడ్ అభిమానులు, ఆ పార్టీ నేతలు తమ నాయకుడు ఎక్కడికి వెళ్లిన అక్కడ విజయం తధ్యమని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో బిఆర్‌ఎస్ రానున్న ఎన్నికల్లో మహారాష్ట్రలోని అనేక శాసన సభ స్థానాలు కైవసం చేసుకోవడం ఖాయమన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News