Monday, January 20, 2025

కంటతడి పెట్టిన ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య

- Advertisement -
- Advertisement -

వరంగల్: తనపై వచ్చిన లైంగిక ఆరోపణలపై స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కంటతడి పెట్టుకున్నారు. నేరుగా ఎదుర్కోలేక కొందరు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. 63 ఏళ్ల తనపై లైంగిక ఆరోపణలు చేస్తున్నారని వాపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో సొంత చెల్లిని, బిడ్డను కూడా ముట్టుకోలేని స్థితి కల్పించారని కన్నీటి పర్యంతమయ్యారు. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టిన ఫాదర్ కొలంబో ఆశీస్సులతో మళ్లీ గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా భయపడే ప్రసక్తి లేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News