Monday, January 20, 2025

ఆ టికెట్ నాదే.. గెలుపు నాదే: తాటికొండ రాజయ్య

- Advertisement -
- Advertisement -

స్టేషన్ ఘన్‌పూర్: సామాజిక మాద్యమాల్లో వస్తున్న గాలి వార్తలకు గాబరా పడవద్దని రానున్న ఎన్నికల్లో బిఆర్‌ఎస్ టికెట్ నాదే.. గెలుపు నాదేనని స్టేషన్ ఘన్‌పూర్ ఎంఎల్ఎ డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. గురువారం నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంఎల్ఎ రాజయ్య మాట్లాడుతూ.. నేడు హన్మకొండ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాల అనంతరం నిర్వహిస్తున్న బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హాజరవుతారన్నారు. సభకు బిఆర్‌ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలన్నారు.

ఇటీవల సామాజిక మాద్యమాల్లో వస్తున్న గాలి వార్తలను పట్టించుకోవద్దని, సిఎం కెసిఆర్, బిఆర్‌ఎస్ పార్టీకి వీర విధేయునిగా ఉన్న నాకే బీఆర్‌ఎస్ టికెట్ వస్తుందని గెలుపు మీ అందరి సహకారంతో సునాయాసంగా అధిక మెజార్టీతో గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ అభివృద్ధి సంక్షేమ పథకాలను బూత్ స్థాయిలోకి తీసుకెళ్లి ప్రజలకు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ ఛైర్మన్ గుజ్జరి రాజు, కుడా డైరెక్టర్ ఆకుల కుమార్, మాచర్ల గణేష్‌గౌడ్, ప్రజాప్రతినిధులు ఇల్లందుల సుదర్శన్, బేబి శ్రీనివాస్, తాటికొండ సురేష్, కాశిరెడ్డి మనోజ్‌రెడ్డి, పోలెపల్లి రంజీత్‌రెడ్డి, ఆకారపు అశోక్, భూక్య రమేశ్‌నాయక్, పార్టీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News