Sunday, December 22, 2024

ఇప్పుడు మీడియా పాయింట్‌లోకి..త్వరలోనే కోర్టు బోనులోకి

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర బడ్జెట్‌పై అసెంబ్లీ ఆవరణలోని మీడియాపాయింట్‌లో మాజీ ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడూ మీడియా పాయింట్‌కు రాని కెసిఆర్ ఇప్పుడు మీడియా పాయింట్‌కు వచ్చారని, ఇక ఆ తర్వాత కోర్టులో బోనులోకే వెళ్లాల్సి ఉంటుందని పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కెసిఆర్‌పై విమర్శలు చేశారు. అచ్చంపేట ఎమ్మెల్యే వంశీ కృష్ణ, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ రెడ్డి, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మధన్ మోహన్ రావు గురువారం అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ కెసిఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఊహల్లో బతికారని, ఇంకా నేనే రాజు అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మీరు పెట్టిన బడ్జెట్ ఎవరికి ఉపయోగపడలేదని, నీళ్ళు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ తెచ్చుకుందని, కానీ గత ప్రభుత్వం నీళ్ళు ఇవ్వలేదని అన్నారు. నిధులూ ఇవ్వలేదు, ఇక నియామకాల ఊసే లేదని అన్నారు. అప్పులు చేసి తెలంగాణ ప్రజల జీవితాలను నాశనం చేశారని ధ్వజమెత్తారు.

వాస్తవానికి బడ్జెట్ దగ్గరగా ఉందని, అందుకే ప్రతిపక్షానికి మింగుడు పడటం లేదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును గంగలో కలిపారని ఆరోపించారు. లక్ష రూపాయల రుణమాఫీ ఇప్పటికే చేసిన ఘనత రేవంత్ రెడ్డికి దక్కిందని అన్నారు. గత ప్రభుత్వం మాదిరి అంకెల రూపంలో బడ్జెట్ పెట్టకుండా అన్ని శాఖలకు బడ్జెట్ కేటాయించామని వివరించారు. ఒక్కో రంగానికి ఎన్ని డబ్బులు కేటాయిస్తున్నామని అనేది విపులంగా వివరించామని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు జరగాలనే ఉద్దేశ్యనంతో కేటాయింపులు చేశారని అన్నారు. గత బడ్జెట్‌లో కన్నా వైద్య విద్య కోసం ఎక్కువ కేటాయింపులు చేశారని తెలిపారు. రూ. 9 వేల కోట్లు పైచిలుకు బడ్జెట్ పెట్టి, వైద్య విద్యకు పూర్వ వైభవం తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుందని వివరించారు. బడ్జెట్‌ను తూలనాడే విధంగా కేసీఆర్ మాట్లాడారని గుర్తు చేశారు. గత బడ్జెట్ పేపర్లకే పరిమితం అయ్యిందని అన్నారు. కేసీఆర్ ఇంకా ఊహల్లో ఉండకుండా, బడ్జెట్‌ను ఆహ్వానించాలని అన్నారు.

తెలంగాణ వచ్చిన పదేళ్లలో నీటిపారుదల ప్రాజెక్టులకు ఎంతో డబ్బులు తగలేశారని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, త్రాగు నీటి సదుపాయాలు లేవని, పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేరని అన్నారు. వైద్య, విద్య రంగాలకు అధిక నిధులు కేటాయించారని తెలిపారు. జాబ్ క్యాలెండర్ కూడా పెట్టేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని, సెప్టెంబర్ 5, 6 లోగా గ్లోబల్ మేథో సంపత్తి కోసం స్కిల్ యునివర్సిటీ పెట్టే విధంగా ఏర్పాటు చేస్తున్నారని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News