Monday, January 13, 2025

వెలమ వివాదం… ఆ మాటలను వెనక్కి తీసుకుంటున్నా: ఎమ్మెల్యే శంకర్

- Advertisement -
- Advertisement -

వెలమ వివాదంపై షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ క్లారిటీ

తప్పుగా భావిస్తే నా మాటలను ఉపసంహరించుకుంటున్నా

నియంతృత్వ ధోరణి అవలంబించే వారిని నేను విమర్శించాను

వెలమలని ఉద్దేశించి అలా మాట్లాడలేదు

నేను మాట్లాడిన మాటలను వెనుక ముందు కత్తిరించి పెట్టారు

నేను ఒక శాసనసభ్యుడిని అందరినీ గౌరవిస్తా

షాద్ నగర్ లో మీడియా సమావేశంలో ఎమ్మెల్యే శంకర్

రంగారెడ్డి: వెలమలను దూషించారన్న వివాదంపై షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్పందించారు. తన మాటలు వెలమ జాతికి సంబంధించినవిగా భావిస్తే తన మాటలను ఉపసంహరించుకుంటున్నానని స్పష్టం చేశారు. శనివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే శంకర్ మాట్లాడారు. తాను మాట్లాడిన మాటలను వెనక ముందు కత్తిరించి కొన్ని మాటలను మాత్రమే వివాదాస్పదంగా మార్చి కొంతమంది సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని తెలియజేశారు. తాను ఒక శాసనసభ్యుడునని అందరి సహకారంతోనే ఎమ్మెల్యేగా మారానని, గత పది ఏళ్లుగా నియంతృత్వ ధోరణి అవలంబించిన కల్వకుంట్ల కుటుంబం గురించి ఉద్దేశించి తాను మాట్లాడనే తప్ప వెలమ సమాజంపై తనకు ఎలాంటి తప్పుడు అభిప్రాయం లేదని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు. ఒకవేళ ఈ మాటలు తప్పుగా భావిస్తే తాను ఈ మాటలను వెనక్కి తీసుకుంటున్నానని తెలిపారు. గత కొన్ని రోజుల క్రితం మాట్లాడిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో కొంత మంది వైరల్ చేశారని పేర్కొన్నారు. తెలంగాణను కల్వకుంట్ల కుటుంబం అప్పులు కుప్పలుగా మార్చిందని చెప్పే క్రమంలో వారిని ఉద్దేశించి మాట్లాడడం జరిగిందని కానీ ఎవరిని కించపరచాలని గాని వారి మనోభావాలను నొప్పించాలని ఉద్దేశం తనకు లేదని ఎమ్మెల్యే శంకర్ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News