Thursday, December 12, 2024

రియల్ దందాకు అక్రమార్కుల అండ

- Advertisement -
- Advertisement -

ప్రేమావతిపేట పెద్ద చెరువు పరిధిలో 55.18
ఎకరాలు ఆక్రమించిన రియల్ సంస్థ
నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణాలకు
అనుమతించిన అధికారులు దర్యాప్తు చేసి
కఠినంగా శిక్షించాలి అపార్టుమెంట్లు, విల్లాల
పేరిట వినియోగదారులను వంచిస్తున్న
రియల్ సంస్థలు హైడ్రా, రెరా అధికారులకు
కామారెడ్డి ఎంఎల్‌ఎ వెంకటరమణారెడ్డి ఫిర్యాదు

మన తెలంగాణ/సిటీ బ్యూరో: ప్రిస్టీజ్ సిటీ రియల్ ఎస్టేట్ సంస్థ పొందిన భవన నిర్మాణ అనుమతులు పూర్తిగా అక్రమమని, నియమాలకు విరుద్దమని వాటిని రద్దు చేసి సం బంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కామారెడ్డి శాసన సభ్యుడు కాటిపల్లి వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రిస్టీజ్ సంస్థ నిర్మాణాలపై చర్యలు తీ సుకోవాలని, చెరువుల భూములను కాపాడాలని లేక్ ప్రొ టెక్షన్ కమిటీ చైర్మన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ కార్యాలయంలో, రెరా సంస్థలోనూ లిఖిత పూర్వకంగా ఆయన ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం ప్రేమావతిపేట్ గ్రామపరిధి పెద్ద చెరువు( లేక్ ఐడి నెం.2921)

పరిధిలోని సర్వే నెం. 57,58,59, 60, 61,62,63,64,68తో పాటు 86లలోని ఎకరాలు 55.18 గుంటలను ఆక్రమించుకుని బహుళ అంతస్థుల భవనాల ను నిర్మిస్తూ రియల్ వ్యాపారం సాగిస్తున్నారంటూ ఎమ్మె ల్యే వెంకటరమణారెడ్డి ఆరోపించారు. “ది ప్రెస్టీజ్ సిటి హైదరాబాద్ అపార్ట్‌మెంట్స్‌”, “ది ప్రిస్టీజ్ సిటీ, హైదరాబా ద్ విల్లాస్‌” పేరిట బహుళ  అంతస్థలు భవనాలను నిర్మిస్తూ రియల్ వ్యాపారం సాగిస్తున్నదని, వీటిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని హైడ్రాకు ఆయన చేసిన ఫిర్యాదులో డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం ప్రేమావతిపేట గ్రామ రెవెన్యూ పరిధిలోని లేక్ ఐడి నెం.2921 చెరువుకు సంబంధించిన సర్వే నెం.86లో ఎఫ్‌టిఎల్ పరిధిలోని 9 ఎకరాలు బఫర్‌జోన్‌లోని 5 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నారని, వాల్టా చట్టం2002 నియమాలకు విరుద్దంగా, జీహెచ్‌ఎంసి అనుమతులకు వ్యతిరేకంగా నిర్మాణాలు చేపడుతున్నారని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ నిర్మాణాల వల్ల చెరువు పరిసర ప్రాంతాల్లోని వాతావరణం పూర్తిగా నాశనం చేస్తున్నారంటూ, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే తన ఫిర్యాదులో వెల్లడించారు. ఇరిగేషన్, రెవెన్యూ విభాగాల నుంచి నిరభ్యంతర సర్టిఫికేటట్ (ఎన్‌ఓసి)ను తీసుకునేందుకు ఫోర్జరీ చేసిన మ్యాప్‌లను అందజేసి మోసపూరితంగా పొందినట్టు ఆయన ఆరోపించారు. సర్వే నెం. 86లోని ఎకరాలు 19 గుంటలు 02 భూమి 195455లో నిజప్రతులైన పహానీలలో, 197576 నుంచి ఇప్పటికీ శిఖం తలాబ్ ల్యాండ్ గా గుర్తించబడి ఉందనీ హెచ్‌ఎండిఏ లేక్ మ్యాప్‌లైన క్రెడెస్టల్ మ్యాప్‌లోనూ ప్రిస్టీజ్ బిల్డర్ మోసం చేశారనీ ఆయన ఆరోపించారు. రెరా అనుమతుల కోసం కూడా నిర్మాణదారుడు వాస్తవాలను దాచిపెట్టి, ఫోర్జరీ సంతకాలు, అధికారులను తప్పుదోవ పట్టించి ఎన్‌ఓసిలతో పొందినట్టు, ఆ సంస్థపైనా, ఆ సంస్థకు సహకరించిన అధికారులపైనా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. రెవెన్యూకు, సహజసిద్దమైన వాతావరణానికి, నీటివనరుల పరిరక్షణకు నష్టం వాటిల్లే విధంగా ప్రిస్టీజ్ బిల్డర్‌తో రెవెన్యూ, ఇరిగేషన్, జీహెచ్‌ఎంసి అధికారులు కుమ్మక్కై అనుమతులు మంజూరు చేసి నీటివనరుకు తీవ్ర నష్టం కలిగించడంతో పాటు ప్రజా విశ్వాసానికి భంగం కలిగించేట్టుగా అధికారులు వ్యవహరించారనీ ఆయన ఆరోపించారు.

చెరువుల ప్రాంతాల్లో బలహీన వర్గాలు ఏర్పాటు చేసుకున్న నిర్మాణాలను కూల్చేసిన హైడ్రా.. నీటి వనరులను ఆక్రమించుకుని నిర్మిస్తున్న నిర్మాణాలపై హైడ్రా చర్యలు తీసుకుని చెరువును కాపాడాల్సిన బాధ్యత హైడ్రా పై ఉందని ఆయన సూచించారు. నియమాలకు విరుద్దంగా ప్రిస్టీజ్ సిటీ సంస్థ పొందిన అనుమతులపై, వాటిని జారీచేసిన అధికారులపై స్వతంత్ర సంస్థచే విచారణ జరిపించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. జీహెచ్‌ఎంసి, రెరా, ఇరిగేషన్, రెవెన్యూ విభాగాల నుంచి పొందిన సర్టిఫికేట్లను, అనుమతులను సస్పెన్షన్ చేయాలని, అనుమతులను రద్దు చేయాలనీ, ఆ భూములను రెవెన్యూ నిషేధిత జాబితాలో చేర్చాలని వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. మోసపూరిత ఎన్‌ఓసిలను జారీచేసిన, మ్యాప్‌లను ఫోర్జరీ చేసిన అధికారులపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చెరువు ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్‌లలో ఆక్రమించుకుని నిర్మించిన కట్టడాలను కూల్చివేయాలని కోరారు. ఈ ప్రిస్టీజ్ సంస్థ ద్వారా భవిష్యత్తులోనూ ఎలాంటి ముప్పు వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.

అసెంబ్లీలో మాట్లాడుతాం..
ప్రెస్టేజ్, ఫీనిక్స్, క్యండియార్, ప్రణీత్ గ్రూప్ తదితర కంపెనీలు చెరువులను కబ్జా చేస్తూ…అక్రమ నిర్మాణాలు చేస్తున్నారనేదానిపై రెండు నెలల క్రితమే తాను ప్రెస్ మీట్‌లో తెలిపాను అని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి తెలిపారు. సరిగా తాను మాట్లాడిన 10 రోజుల తర్వాత పర్మిషన్ ఇచ్చిన నిర్మాణాల జోలికి వెళ్లమని సీఎం , డిప్యూటీ సిఎం ప్రకటించారని తెలిపారు.వీటికి పర్మిషన్ ఇచ్చిన వారు ఎవరు? పర్మిషన్ ఇచ్చిన వారిపై చర్యలేందుకు లేవు ? ఈ ఐదు కంపెనీలపై రంగనాథ్ కు ఫిర్యాదు చేశానని తెలిపారు. ఈ విషయంపై అసెంబ్లీలో మాట్లాడతామని వెల్లడించారు. ఆక్ట్ తో కబ్జా ల నివారణ జరుగుతుందనీ, అసెంబ్లీలో చర్చకు పట్టు పడతాం. ప్రభుత్వం స్పందించకుంటే కోర్టుకి వెళ్తాం. ల్యాండ్ గ్రాభింగ్‌పై రిఫారమ్స్ తీసుకురాకుంటే నాయకులను ప్రజలు తరిమి కొడతారు. అని వెంకటరమణారెడ్డి ఫిర్యాదు అనంతరం మాట్లాడుతూ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News