Saturday, December 28, 2024

బిజెపికి ఎంఎల్‌ఏ వీరేంద్ర రఘువంశీ గుడ్‌బై

- Advertisement -
- Advertisement -

శివపురి : ఈ ఏడాది ఆఖరులో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఎమ్‌ఎల్‌ఎ వీరేంద్ర రఘువంశీ గురువారం అధికార పార్టీ బీజేపీ నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించారు. పార్టీలో తననెవరూ పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. మధ్యప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు విష్ణుదత్ శర్మను ఉద్దేశిస్తూ రాసిన రాజీనామా లేఖను ఇక్కడి విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. కొలారస్ అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రఘువంశీ గత మూడు నాలుగేళ్ల నుంచి తన ఆవేదనను ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు పార్టీ అగ్రనాయకత్వానికి వివరిస్తున్నానని ,

కానీ ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో తాము అంకిత భావంతో పనిచేశామని, కానీ కొత్తగా వచ్చిన బీజేపీ సభ్యులు కారణంగా తనవంటి పార్టీ కార్యకర్తలకు గ్వాలియర్ చంబల్ డివిజన్‌లో గుర్తింపు ఉండడం లేదని పేర్కొన్నారు. కొలారస్ నియోజక వర్గంలో అవినీతిపరులైన అధికారులు నియామకమయ్యారని, తాను చేపట్టిన అభివృద్ధిపనులకు ఆటంకాలు కల్పిస్తున్నారని ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News