Tuesday, December 24, 2024

ప్రగతి యాత్రలో భాగంగా ఎమ్మెల్యే పర్యటన

- Advertisement -
- Advertisement -

కుత్బుల్లాపూర్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సూరా రం 129 డివిజన్ పరిధిలోని మార్కండేయ నగర్, నెహ్రూనగర్‌లలో ప్రగతి యాత్రలో భాగంగా 88వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటించారు. ఈ సందర్భంగా పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన రోడ్లు, డ్రైనేజీ వంటి అభివృద్ధి పనులు పరిశీలించారు. అదే విధంగా సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతున్నాయో ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కాగా తమ బస్తీల అభివృద్ధికి నిధుల కొరత లేకుండా ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఎమ్మెల్యే కి ఘన స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలిపారు.

మిగిలి ఉన్న చిన్నపాటి పనులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా.. అక్కడే ఉ న్న అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిజిఎం అప్పల నాయుడు, డిఈఈ శిరీష, స్థానిక డివిజన్ బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు పుప్పాల భాస్కర్, ప్రధాన కార్యదర్శి సిద్ధిక్, వార్డు మెంబర్ అరుణ, సీనియర్ నాయకులు ఫరోజ్, ముకుందం, గండయ్య, నవీన్, విఠల్, అఖిల్, దశరథ్, కిరణ్, కృష్ణ, దాస్ మరియు బస్తీలవాసులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News