Wednesday, January 22, 2025

ఈడీ విచారణకు హాజరైన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ గురువారం ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ) విచారణకు హాజరయ్యారు. విశాఖ ఇండస్ట్రీస్, ఎంఎస్ విజిలెన్స్ సెక్యూరిటీస్ లావాదేవీలపై ఈడీ విచారిస్తోంది. విశాఖ ఇండస్ట్రీస్, ఎంఎస్ విజిలెన్స్ సెక్యూరిటీ మధ్య రూ. 100 కోట్ల లావాదేవీలు జరిగాయని కేసు నమోదైంది. ఎన్నికల సమయంలో గుర్తించిన లావాదేవీలపై ఈడీ విచారించింది. రూ. 8 కోట్ల బ్యాంకు లావాదేవీలపై గతంలో పోలీసులు కేసు నమోదు చేశారు. మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసి ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈడీ అధికారులు నవంబర్ లో విశాఖ సంస్థల్లో సోదాలు చేసింది. విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ బోగస్ కంపెనీగా ఈడీ గుర్తించింది. కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నట్లుగా ఉన్న డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News