Sunday, March 2, 2025

కెసిఆర్‌ను మించిన పెద్ద తుగ్లక్ కెటిఆర్: ఎంఎల్ఎ వివేక్ వెంకటస్వామి

- Advertisement -
- Advertisement -

వారం రోజులుగా బిఆర్‌ఎస్ నేత కెటిఆర్, అతని మనషులు తనను ఇష్టం వచ్చినట్లు ట్రోల్ చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆవేదన చెందారు. కెసిఆర్‌ను మించిన పెద్ద తుగ్లక్ కెటిఆర్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన సెక్రటేరియట్‌లోని మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ తాము కొన్నప్పుడే తన ఫాంహౌస్‌కు కాంపౌండ్ వాల్ ఉందని, ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్ నిబంధనల ప్రకారమే తమ ఫాంహౌస్ ఉందని ఆయన పేర్కొన్నారు. సొంత చెల్లెను గెలిపించుకోలేని కెటిఆర్ లీడర్ ఎలా అవుతారని ఆయన విమర్శించారు. సినిమా యాక్టర్లతో కెటిఆర్‌కు ఉన్న సంబంధాలు అందరికీ తెలుసు అని ఆయన వ్యాఖ్యానించారు. కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దానిని నిరూపించాలని కెటిఆర్‌కు వివేక్ సవాల్ చేశారు. తెలంగాణ ఉద్యమం,

ప్రజల సమస్యలు చూపేందుకే తాను టివి ఛానల్‌ను స్థాపించానని ఆయన అన్నారు. అప్పటి సిఎం కిరణ్ కుమార్ రెడ్డి ఎంత ఇబ్బంది పెట్టినా ఆగకుండా తెలంగాణ కల్చర్‌ను కేవలం తన ఛానల్‌లోనే చూపించామని ఆయన గుర్తుచేశారు. కాళేశ్వరం, మిషన్ భగీరథలో జరిగిన అక్రమాలు, లోపాలను తమ పేపర్లు, ఛానల్లో చూపించామన్నారు. కెసిఆర్, కెటిఆర్ ఈ రెండు సంస్థలను బ్యాన్ చేయాలని చూసినా ప్రజల నుంచి వచ్చిన ఆదరణతో ఏమి చేయలేకపోయారన్నారు. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్న పదేళ్ల పాటు తమ పేపర్‌కు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటనలు రాకుండా వివక్ష చూపించారని ఆయన అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తనపై ఈడీ దాడులు చేయించారన్నారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని చివరకు తమ డబ్బులు తమకు ఇచ్చారని వివేక్ వెంకటసాస్వామి గుర్తుచేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News