బెంగళూరు: దుబాయ్ నుంచి 14 కిలోల బంగారం స్మగ్లింగ్ చేస్తూ.. నటి రన్యారావు బెంగళూరు విమానాశ్రయంలో పట్టుబడిన విషయం తెలిసిందే. దీంతో డిఆర్‌ఐ అధికారులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. అయితే తాజాగా ఈ కేసులో బిజెపి ఎమ్మెల్యే అసభ్యకర వార్తలు చేశారు. ఆమె తన ప్రైవేటు భాగాల్లో బంగారం దాచిపెట్టిందని బీజాపూర్ బిజెపి ఎమ్మెల్యే బసంగౌడ పాటిల్ చేసిన వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఈ వ్యవహారంలో మంత్రుల ప్రమేయం కూడా ఉందని ఆరోపించారు.
పాటిల్ ఈ విషయంపై మాట్లాడుతూ.. రన్యారావు తన శరీరం అంతా బంగారంతో కప్పేసిందని.. ఆమె ఎక్కడెక్కడ బంగారం దాచిపెట్టిందో తనకు తెలుసని పాటిల్ పేర్కొన్నారు. ఆమె తన ప్రైవేటు భాగాల్లో బంగారం దాచి పెట్టింది అంటూ అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఈ కేసులో మంత్రుల ప్రమేయం కూడా ఉందని.. శాసనసభ సమావేశాల్లో అన్ని బయటపెడతానని ఆయన పేర్కొన్నారు. ఆమెకు పరిచయం ఉన్న ఇద్దరు మంత్రుల పేర్లు బయటపెడతానని చెప్పారు. రన్యారావుకు ప్రొటోకాల్ ఇచ్చిన వారి వివరాలు తెలుసని.. వాళ్లకి బంగారం ఎక్కడి నుంచి వచ్చిందో.. ఎవరు తెచ్చారో తనకి తెలసన్నారు. ఎవరు చేసినా అది తప్పే అని.. కస్టమ్స్ అధికారులు చేసిన తప్పులను సమర్థించడం లేదని తెలిపారు.