అంతర్గాం: గిఫ్ట్ స్మైల్‌లో భాగంగా ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఓ గుడు లేని నిరుపేద అభాగ్యురాలికి ఇంటి నిర్మాణానికి సహకరించి, పూర్తయిన ఆ ఇంటిని సోమవారం ప్రారంభించారు. మండలంలోని గోలివాడ గ్రామానికి చెందిన గాదెం రాజమ్మ నిరుపేద ఒంటరి మహిళ తనకు ఎవరు లేరని తెలిపిన ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌కు విన్నవించింది. దీనికి స్పందించిన ఆయన ఆమె ఉండేందుకు ఇంటిని నిర్మించి ఆమె కళ్లలో ఆనందం పంచాలన్న సంకల్పంతో ఆమెకు ఇంటిని నిర్మించారు. ఈ మేరకు ఆమె ఇంటిని ప్రారంభించి ఆమెకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ఆముల నారాయణ, నగర మేయర్ బంగీ అనిల్ కుమార్, వైస్‌ఎంపీపీ మట్ట లక్ష్మీమహేందర్ రెడ్డి, మండల కోఆప్షన్ సభ్యులు గౌస్ పాషా, ఫ్యాక్స్ చైర్మన్ మామిడాల ప్రభాకర్, సర్పంచ్‌లు ధరణి రాజేష్, బాదరవేని స్వామి, ధర్మాజీ కృష్ణ, బండారి ప్రవీన్, తుంగపిండి సతీష్, గుమ్ముల రవీందర్, మండల బీఆర్‌ఎస్ అధ్యక్షుడు తిరుపతి నాయక్, నాయకులు కొలిపాక మధుకర్ రెడ్డి, గీట్ల శంకర్ రెడ్డి, కొల్లూరి సతీష్, కరవెద శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.