Sunday, January 19, 2025

బస్తీ దవాఖానా ప్రారంభించిన ఎమ్మెల్యే

- Advertisement -
- Advertisement -

భైంసా : పట్టణంలోని కాలనీలో బస్తీ దవాఖానాను ఎమ్మెల్యే విఠల్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేటు దవాఖానాలకు దీటుగా తీర్చిదిద్ది అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారన్నారు. సర్కారు దవాఖానాల్లో సదుపాయాలు కల్పించడంతో పాటు పల్లె బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసి డాక్టర్లు, వైద్య సిబ్బందిని నియమించి పేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందేలా చర్యలు తీసకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జేకే పటేల్, మాజీమార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆసిప్, బిఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు ఫారుఖ్ హైమద్, ప్రధాన కార్యదర్శి తోట రాము, డిప్యూటీ డీఎం అండ్ హెచ్‌వో ఇద్రిజ్, హెల్త్ సూపర్ వైజర్ ఖలీం, మతీన్, బిఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News