Friday, December 20, 2024

రామాయంపేట మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే

- Advertisement -
- Advertisement -

రామాయంపేట: రామాయంపేట మున్సిపల్ పట్టణంలో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పర్యటించారు. నియోజకవర్గానికి నూతన రోడ్డు నిర్మాణం కోసం 60 కోట్ల నిధులు మంజూరయ్యాయని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. రామాయంపేట మున్సిపల్ పరిదిలోని కోమటిపల్లి గ్రామంలో సోమవారం అంబేద్కర్ విగ్రహస్థాపనకు భూమిపూజ నిర్వహించారు. అనంతరం రామాయంపేట తండాకు సంబందించిన చెరువుకు 78 లక్షల రోడ్డు నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో కెసిఆర్ ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు ప్రజాసంక్షేమానికి అద్బుతంగా కొనసాగుతున్నాయని ప్రజలకు సిఎం కెసిఆర్ అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారన్నారు.

దళితులకు దళితబందు కార్యక్రమం బిసి వర్గాలకు లక్షరూపాయల రుణ సహాయం అందించడం జరుగుతుందన్నారు. అభివృద్ధికి మారు పేరుగా రోడ్ల నిర్మాణం ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందన్నారు. మొత్తం నియోజకవర్గానికి 90 కోట్ల రూపాయలు రోడ్ల నిర్మాణాలకు ముందుగా 60 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్‌గౌడ్, బిఆర్‌ఎస్ పట్టణ అద్యక్షుడు, నాలగవ వార్డు కౌన్సిలర్ గజవాడ నాగరాజు, పిఎసిఎస్ చైర్మన్ బాజ చంద్రం, బిఆర్‌ఎస్ నాయకులు, అధికారులు, తండావాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News