Thursday, December 26, 2024

కెసిఆర్ పర్యటన సినిమా షూటింగ్‌లా ఉంది: ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

- Advertisement -
- Advertisement -

కెసిఆర్ దేవరుప్పలకు రావడం సినిమా షూటింగ్ లా ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి విమర్శించారు. కెసిఆర్ పర్యటనపై ఆమె మాట్లాడుతూ… బిఆర్‌ఎస్ నాయకులంతా దేవరుప్పల వద్ద ఉన్న ధరావత్ తండాలోని ఒకే రైతు దగ్గరకు ఎందుకు వస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.

హరీష్ రావు, యర్రబెల్లి దయాకర్ రావు అక్కడికే వచ్చారని, ఇప్పడు కెసిఆర్, తర్వాత కెటిఆర్, హిమాన్షు కూడా ఇక్కడికే వస్తారేమోనని ఆమె ఎద్దేవా చేశారు. అక్కడ ఉన్న రైతు సత్తెమ్మకు 8 ఎకరాల పొలం ఉంటే అందులో రెండు ఎకరాలు మాత్రమే వ్యవసాయం చేశారని, అందులో కూడా అర్ధ ఎకరం లోపల ఎండిపోయిందని, ఆ పొలంలో నాలుగు బోర్లు వేయడం, వీరందరూ ఒకే రైతు దగ్గరకు రావడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు.

కాగా, జిల్లాలో పర్యటనలో భాగంగా కెసిఆర్ ఆదివారం నల్లగొండ, జనగాం, సూర్యపేట జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎండిపోయిన పంటలను పరిశీలించి, బాధిత రైతులతో మాట్లాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News