Wednesday, January 22, 2025

కవిత దీక్షను చూస్తే నవ్వు వస్తుంది: ఎంఎల్ఎ యశస్విని రెడ్డి

- Advertisement -
- Advertisement -

కవిత దీక్షను చూస్తే తనకు నవ్వు వస్తోందని, వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి తీర్థ యాత్రలకు పోయినట్లుగా కవిత వైఖరి ఉందని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి విమర్శించారు. వర్ధన్నపేట, పాలకుర్తి నియోజక వర్గాల నుంచి పలువురు బిఆర్‌ఎస్ నాయకులు శనివారం గాంధీ భవన్‌లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసిసి ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో ఎమ్మెల్యేలు నాగరాజు, యశస్విని రెడ్డిల ఆధ్వర్యంలో వివిధ పార్టీల నాయకులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా యశస్విని రెడ్డి మాట్లాడుతూ ఇంతకాలం పక్కన పెట్టిన జాగృతిని కవిత మళ్లీ తెరిచిందని ఆమె ఎద్దేవా చేశారు.

కవిత ఈ పదేళ్లలో ఎప్పుడైనా మహిళల గురించి మాట్లాడారా? అంటూ ఆమె ప్రశ్నించారు. ఎన్నడూ గుర్తుకు రాని మహిళలు పదవి పోగానే కవితకు గుర్తుకు రావడం విచిత్రంగా ఉందని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి పనులు చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న విస్తృత స్థాయి కార్యక్రమాలతోనే వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున కాంగ్రెస్‌లోకి వస్తున్నారన్నారు. వాళ్లను కాంగ్రెస్ పార్టీ ఆదరిస్తుందని, ఎవరికి ఏ స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వాలో తప్పనిసరిగా అందిస్తుందని ఆమె హామినిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News