Sunday, December 22, 2024

ఈ నెల 13న మేడిగడ్డకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

- Advertisement -
- Advertisement -

ఫిబ్రవరి 13తేదీన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మేడిగడ్డ సందర్శనకు వెళ్లనున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తెలంగాణ ప్రభుత్వం మేడిగడ్డకు తీసుకెళ్లనున్నట్లు ప్రకటించింది. రేపు సాయంత్రం సీఎల్సీ సమావేశం నిర్వహించనుంది కాంగ్రెస్ సర్కార్. ఈనెల 12న సభలో నీటిపారుదల శాఖపై శ్వేతపత్రం విడుదల చేయనుంది. నీటిపారుదల శాఖ అవినీతి, అక్రమాలపై సమావేశంలో చర్చించనున్నారు. కృష్ణా జలాలపై ఫిబ్రవరి 12న శాసనసభలో జరిగే చర్చలో ప్రతిపక్షనేత, మాజీ సీఎం కే చంద్రశేఖర్‌రావు పాల్గొని మేడిగడ్డ బ్యారేజీ అధికారిక పర్యటనలో పాల్గొనాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News