Tuesday, January 21, 2025

ఉద్యమ గాయకుడికి నివాళులర్పించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు

- Advertisement -
- Advertisement -

కల్వకుర్తి ః ఉద్యమ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ సాయి చందు హఠాన్మరణం చెందిన వార్త తెలుసుకున్న కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి గురువారం హైదరాబాద్‌లోని సాయిచందు నివాసంలో ఆయన భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యమంలో ప్రతి ఒక్కరి హృదయాలను కదిలించే పాటలు పాడారని, సాయి చందు భౌతికంగా మన మధ్యన లేకున్నా ఆయన పాటలతో అందరి మనసులో నిలిచిపోయారన్నారు. ఒక గొప్ప గాయకుడిని కోల్పోయామని అన్నారు. ఎంతో మంది కళాకారులకు, గాయకులకు ఉపాధి అవకాశాలు కల్పించారని అన్నారు. అతని కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News