Wednesday, January 22, 2025

ఎంఎల్ఏ ల పార్టీ ఫిరాయింపుల కేసు విచారణ వాయిదా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎంఎల్ఏల పార్టీ ఫిరాయింపుల కేసులో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ లో దాఖలైన పిటిషన్ పై గురువారం హైకోర్టు విచారణ జరిపింది. కాగా వాదనలు వినిపించేందుకు అడ్వకేట్ జనరల్ గడువును కోరారు. ఈ కేసు విచారణను కోర్టు వచ్చే నెల 4వ తేదీకి వాయిదా వేసింది.

తమ పార్టీ ద్వారా గెలిచిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులు కాంగ్రెస్ లోకి పార్టీ ఫిరాయింపు జరిపారని, వారిపై అనర్హత వేటు వేసేలా స్పీకర్ కు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ బిఆర్ఎస్ ఎంఎల్ఏ పాడి కౌశిక్ రెడ్డి, కెపి. వివేకానంద హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

విచారణ జరిపిన సింగిల్ జడ్జీ బెంచ్ కీలక తీర్పునిచ్చింది. ఎంఎల్ఏల పార్టీ ఫిరాయింపులపై దాఖలైన అనర్హత పిటిషన్ల స్టేటస్ ఏమిటో చెప్పేందుకు నాలుగు వారాల గడువు ఇస్తున్నామని…ఆ లోగా వివరాలు అందజేయకుంటే మేమే తగిన ఆదేశాలు జారీ చేయాల్సి వస్తుందని అసెంబ్లీ సెక్రటరీకి హైకోర్టు సింగిల్ జడ్జీ బెంచ్ స్పష్టం చేసింది. ఇదిలావుండగా సింగిల్ జడ్జీ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ అసెంబ్లీ సెక్రటరీ డివిజన్ బెంచ్ లో అప్పీలు చేశారు. ఈ పిటిషన్ పై  విచారణ జరిపాక ధర్మాసనం తదుపరి తేదీకి విచారణను వాయిదా వేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News