Saturday, December 21, 2024

ముఖ్యమంత్రిని నిధులు అడిగే ధైర్యం ఎమ్మెల్యేకు లేదు

- Advertisement -
- Advertisement -

రాజేంద్రనగర్ : మహేశ్వం పర్యటనలో ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పిన అబద్దాలు రాజేంద్రనగర్ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని మైలార్‌దేవ్‌పలి డివిజన్ కార్పొటర్ తోకల శ్రీని వాస్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ రాజేంద్రనగర్ నియోకవర్గం నిధుల కోసం ఎప్పుడు కొట్లాడతాడు అని సభా ముఖంగా ముఖ్యమంత్రి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మంగళవారం కాటేదాన్‌లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

నియోజకవర్గం కోసం ఎమ్మెల్యే కొట్లాడి తెచ్చిన నిధులు ఏవి..? కొట్లాడి తెచ్చిన నిధులు రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఎక్కడ ఖర్చు చేశారో చూపించాలని డిమాండ్ చేశారు. ని యోజకవర్గం కోసం ఏమి చేయలేదని లెక్కలతో సహా హోర్డిం గ్‌లు పెట్టి మరీ తెలియజేసిన ఎమ్మెల్యేలో మాత్రం ఏలాంటిమార్పు రాలేదన్నారు. ప్రజలను మభ్యపెట్టడానికి ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు తప్ప చేసింది ఏమి లేదని న్నారు. ఎమ్మెల్యేకు నిధులు అడిగే దైర్యం ఉందని ప్రజలు అనుకోరు, ఒక వేళ ఎమ్మెల్యే నిధులు అడిగినా ముఖ్యమంత్రి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.

ఎమ్మెల్యేకు అడగడం చేతగావడం లేదా ముఖ్యమంత్రి నిధులు ఇవ్వడంలో వివక్ష చూపిస్తున్నారా రాజేంద్రనగర్ ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని డిమాండ్ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. అభివృద్ధి కోసం నిధులు కేటాయించడంలో రాజేంద్రనగర్ మీద రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వివక్ష చూపిస్తుందని, పక్కనున్న మహేశ్వరం నియోజకవర్గానికి దాదాపు 165 కోట్ల ఎస్‌డిఎఫ్ నిధులు మంజూరు చేస్తున్నట్లు నిన్నటి సోమవారం జరిగిన సభలో ముఖ్యమంత్రి ప్రకటించడం చాలా సంతోషం అన్నారు. కానీ ఆనిధులతో ఒక్క రూపాయి అయినా వస్తుందన్న గ్యారంటీ లేదు.

ఎన్నికల ముందు ప్రజలను మభ్య పెట్టేందుకు ఈ అంకెలగారడి చేశారన్నారు. మహేశ్వరంకు వందల కోట్ల నిధులు ఇస్తుంటే అదేసభలో ఉన్న రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ నియోజకవర్గం కోసం నిధులు ఎందుకు అడగ లేదన్నారు. లక్షల మందితో సభ పెట్టితేనే ముఖ్యమంత్రి నిధులు ఇస్తాడనుంటే ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ కూడా రాజేంద్రనగర్‌లో సభ పెట్టి ముఖ్యమంత్రిని పిలిచి నిధులు ఇప్పించాలని డిమాండ్ చేశారు. గతంలో పార్టీలో చేరినప్పుడు , ఎన్నికల ప్రచా రంలో కేసీఆర్, కేటీఆర్ ఇచ్చిన హామీలు కూడా ఇప్పటి వరకు అమలు కలేదని, వాటి గురించి ఎమ్మెల్యే మర్చి పోయాడు అన్నారు.

డబుల్ బెడ్‌రూం ఇండ్లు, సర్పంచ్‌ల బిల్లులు, దళితబంధు, రుణ మాఫీ లాంటి ఏ ఒక్క స ంక్షేమం పథకాలు రాజేంద్రనగర్‌లో సరిగా అమలుకావడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి నిధులు తేకుండా నిద్రపోతూ ప్రజలను మోసం చేస్తున్న ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌కు రానున్న ఎన్నికల్లో ప్రజలు తప్పకుండా బుద్ది చెప్తారని హెచ్చరిస్తున్నట్లు కార్పొరేటర్ తోకల శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News